కోహ్లీ Vs లుంగ్డి: వన్డే సిరిస్‌ను ప్రభావితం చేసే ఆటగాళ్లు వీరే
హైదరాబాద్: మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ముగిసింది. కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా 1-2తో టెస్టు సిరిస్‌ను చేజార్చుకుంది. ఇప్పుడు ఆరు వన్డేల సిరిస్ ప్రారంభమైంది. సిరిస్‌లో భాగంగా తొలి వన్డే డర్బన్‌లోని కింగ్స్‌మీడ్‌లో గురువారం (ఫిబ్రవరి 1)న సాయంత్రం 4.30 గంటలకు జరగనుంది. ఈ సిరిస్‌ను ప్రభావితం చేసే ఇరు జట్లకు చెందిన ఐదుగురు ఆటగాళ్లను ఒక్కసారి పరిశీలిస్తే...

విరాట్ కోహ్లీ Vs లుంగి ఎంగ్డి
ఇటీవల ముగిసిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 286 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. గతేడాది వన్డేల్లో 26 మ్యాచ్‌లాడిన కోహ్లీ 1460 పరుగులతో అత్యధిక పరుగులు నమోదు చేసిన ఆటగాడిగా కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఇక, 21 ఏళ్ల లుంగి ఎంగ్డి విషయానికి వస్తే ఇటీవలే అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేశాడు. వన్డేల్లో ఇంకా అరంగేట్రం చేయలేదు. తన తొలి టెస్టులో 7 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని సైతం సొంతం చేసుకున్నాడు. రెండు టెస్టుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని రెండు సార్లు పెవిలియన్‌కు పంపాడు.

భువనేశ్వర్ కుమార్ Vs హషీం ఆమ్లా
టీమిండియా ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ స్వింగ్ ఇప్పటివరకు దక్షిణాప్రికా బ్యాట్స్‌మన్ హషీం ఆమ్లాకు అర్ధం కాలేదు. ఇటీవల ముగిసిన టెస్టు సిరిస్‌లో భువనేశ్వర్ కుమార్ త్వరితగతిన వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. ప్రత్యర్ధి జట్లపై ఎంతో ఓర్పుగా ఆడే ఆమ్లాను భువీనే ఎక్కువ సార్లు పెవిలియన్‌కు చేర్చడం విశేషం. కాగా, వన్డేల్లో ఆమ్లా బ్యాటింగ్ యావరేజి 51.26గా ఉంది.

బుమ్రా Vs డీకాక్
వన్డేల్లో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరుగాంచిన బుమ్రా యార్కర్ల వేయడంలో దిట్ట. అయితే ఎటువంటి బౌలర్‌నైనా సమర్ధవంతంగా ఎదుర్కొనగలిగే ఆటగాడు డీకాక్. వన్డేల్లో డీకాక్ చేసిన 13 సెంచరీల్లో ఐదు సెంచరీలు భారత్‌పైనే చేయడం విశేషం. ప్రస్తుతం డీకాక్ ఫామ్‌లో లేకపోవడం ఆ జట్టుని కలవరపెడుతోంది. ఆరు వన్డేల సిరిస్‌లో డీకాక్‌ను బుమ్రా త్వరగా పెవిలియన్‌కు చేర్చాలని అభిమానులు కోరుకుంటున్నారు.

రోహిత్ శర్మ Vs కగిసో రబడ
ఉపఖండంలో పరుగులు సాధించిన విధంగా సఫారీ గడ్డపై పరుగులు చేయడం చాలా కష్టం. ఈ విషయంలో టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా సఫారీ పేసర్ కగిసో రబడను ఎదుర్కొవాల్సి ఉంటుంది. తన పేస్‌తో రోహిత్ శర్మను క్రీజులో కుదురుకోకముందే రబడ పెవిలియన్‌కు చేర్చడం ఖాయంగా కనిపిస్తోంది. సఫారీ గడ్డపై రోహిత్ శర్మకు వన్డేల్లో మెరుగైన రికార్డు కూడా లేకపోవడం జట్టును కలవరపరిచే విషయం.

ధోని Vs ఇమ్రాన్ తాహిర్
ఈ సిరిస్‌లో ధోని మరో మైలురాయికి చేరువలో ఉన్నాడు. వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి ధోని కేవలం 102 పరుగుల దూరంలో ఉన్నాడు. పవర్ ప్లే ఓవర్లలో ఇమ్రాన్ తాహిర్ అద్భుత ప్రదర్శన చేయగలడు. తాహిర్ గూగ్లీలు వేయడంతో దిట్ట. అయితే ధోని ఈ గూగ్లీలను సమర్ధవంతంగా ఎదుర్కొనగలడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications