IND VS PAK: కోహ్లీ భాయ్ జర జాగ్రత్త.. ఆ ఇద్దరితోనే డేంజర్!
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 23న భారత్ - పాక్ మధ్య మ్యాచ్ కు అంతా సిద్ధమైపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట అభిమానులంతా ఈ మ్యాచ్ కోసం ఎంతో ఉత్కంఠతో ఉన్నారు. న్యుజిలాండ్ పై ఓటమితో కసిగా ఉన్న పాకిస్థాన్ - బంగ్లాపై గెలుపుతో జోష్ లో ఉన్న టీమిండియా.. రెండూ ఈ మ్యాచ్ లో గెలవాలని పట్టుదలతో ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్ లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి.. పాకిస్థాన్ కు చెందిన ఇద్దరు క్రికెటర్ల నుంచి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.
స్పిన్ బౌలింగ్ లో పెవిలియన్ కు..
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గత కొద్ది కాలంగా ఫామ్ లేక ఇబ్బంది పడుతోన్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గానే అతడు కాస్త ఫామ్ లోకి వచ్చినట్లు అనిపించింది. ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్‌లో ఓ హాఫ్ సెంచరీ బాదిన అతడు.. ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాపై 22 రన్స్ సాధించాడు. అయితే బంగ్లాదేశ్ పై రన్స్ కోసం ఏకంగా 38 బంతులు తీసుకున్నాడు. స్పిన్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.

ఆ ఇద్దరి నుంచే ముప్పు..
పాకిస్థాన్ ప్లేయర్స్ పేసర్ హారిస్ రవూఫ్, కొత్త స్పెషలిస్ట్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ నుంచి కోహ్లీకి కాస్త ముప్పు ఉందనే చెప్పాలి. టీ20ల్లో రవూఫ్ పై మంచి రికార్డు ఉన్న కోహ్లీకి.. వన్డేలో మాత్రం లేదు. ఇక విరాట్ స్పిన్ ఆడటంతో ఇబ్బందిపడుతూ పెవిలియన్ చేరుతున్నాడు. కాబట్టి ఇప్పుడు అతడు స్పిన్నర్ అబ్రార్‌పై ఎలాంటి ప్రదర్శన చేస్తాడన్నది కూడా ఆసక్తికరం. అలా ఈ ఇద్దరు పాక్ ప్లేయర్స్ తో కోహ్లీ కాస్త జాగ్రత్తగా ఆడాల్సిందే. అప్పుడే భారీ స్కోర్ చేయగలడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications