Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లక్నో బౌలర్ కుట్ర.. కోపంతో ఊగిపోయిన కోహ్లీ.. అసలేం జరిగింది?

Digvesh Rathi vs Virat Kohli: ఐపీఎల్ 2025లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అద్బుత విజయాన్ని సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు క్వాలిఫయర్-1లోకి దూసుకెళ్లింది. అయితే ఈ మ్యాచ్‌లో లక్నో బౌలర్ దిగ్వేష్ రతి మరోసారి రచ్చ చేశాడు. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడుతున్న జితేష్ కుమార్‌ను ఔట్ చేసే ప్రయత్నంలో లక్నో బౌలర్ దిగ్వేష్ పెద్ద కుట్రకు తెరలేపాడు. మన్కడింగ్ చేసి ఆర్సీబీ కెప్టెన్ జితేష్ శర్మను ఔట్ చేయాలని ప్రయత్నించాడు.

నాన్ స్ట్రైక్ ఎండ్‌లో ఉన్నజితేష్ శర్మ క్రీజు నుంచి బయటకు రాగానే బౌలింగ్ చేస్తున్న దిగ్వేష్ రితి బంతితో వెంటనే వికెట్లను బాదేశాడు. ఈ క్రమంలో థర్డ్ అంపైర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. మన్కడింగ్ కారణంగా జితేష్ శర్మ ఔట్ కాదంటూ నాటౌట్ గా ప్రకటించారు. లక్నో బౌలర్ చేసిన మన్కడ్ ప్రయత్నంతో ఆగ్రహించిన విరాట్ కోహ్లీ తన చేతిలోని బాటిల్ విసిరాడు. ఈ ఘటన క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను చేసి సృష్టించింది. లక్నో బౌలర్ చేసిన ఈ ప్రయత్నాన్ని గ్రౌండ్ బయట నుంచి గమనిస్తున్న విరాట్ కోహ్లీ చాలా ఆగ్రహం వ్యక్తం చేశాడు. నిజాయితీగా గెలవడానికి ప్రయత్నించకుండా మన్కడ్ పద్ధతిలో రనౌట్ చేయడం.. అది నిబంధనల ప్రకారం చేసిన మన్కడ్ కాదని కోపంతో బాటిల్ విసిరాడు.

Virat Kohli vs Digvesh Rathi Mankading Controversy Shocks IPL 2025

ఈ సంవత్సరం ఐపీఎల్ సిరీస్‌లో వికెట్ వేడుకల సందర్భంగా దిగ్వేష్ రతి అనేక సార్లు వివాదాల్లో చిక్కుకున్నాడు. దీని కారణంగా దిగ్వేష్ ఒక మ్యాచ్‌లో ఆడకుండా నిషేధించబడ్డాడు. ఆ నిషేధాన్ని పూర్తి చేసిన తర్వాత దిగ్వేష్ ఆడిన మ్యాచ్‌లో ఇంతటి వివాదాన్ని సృష్టించాడు. దీని తర్వాత దిగ్వేష్ రతి ఐపీఎల్ సిరీస్‌లో అత్యంత వివాదాస్పద ఆటగాడిగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 18.4 ఓవర్లలో విజయ లక్ష్యాన్ని చేరుకుంది. ఆర్సీబీ లక్నో సూపర్ జెయింట్స్ జట్టును 6 వికెట్ల తేడాతో ఓడించింది.

అందరి హృదయాలను గెలుచుకున్న రిషబ్ పంత్
ఇంతలో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి రనౌట్ కోసం అప్పీల్ ను ఉపసంహరించుకున్నాడు. రిషబ్ పంత్ నిర్ణయం ఆటగాళ్ల హృదయాలను మాత్రమే కాకుండా ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకున్నాడు. అప్పీల్ ఉపసంహరించుకున్న తర్వాత జితేష్ శర్మ భావోద్వేగానికి గురై మైదానంలో ఉన్న పంత్ వద్దకు వెళ్లి అతడిని కౌగిలించుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

మన్కడింగ్ రూల్స్ ఇలా..
దిగ్వేష్ చర్య కారణంగా మన్కడింగ్ రూల్‌పై చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఐసీసీ నిబంధనల ప్రకారం బంతిని పూర్తిగా వదిలిన క్రమంలో మన్కడింగ్ చేయాల్సి ఉంటుంది. 38.3.1.1 అనే రూల్ ప్రకారం.. బౌలర్ పూర్తిగా తన చేతిలో ఉన్న బంతిని వదిలే దాకా వెళ్లాలి. అప్పుడు మన్కడింగ్ ద్వారా ఔట్ ఇస్తారు. కానీ జితేష్ శర్మ విషయంలో దిగ్వేష్ రతి అలా చేయలేదు. దిగ్వేష్ అసలు బౌలింగ్ వేసినట్లే కనిపించలేదు. ఈ క్రమంలో రూల్ ప్రకారం అంపైర్ నాటౌట్ గా ప్రకటించాడు.

Story first published: Wednesday, May 28, 2025, 10:52 [IST]
Other articles published on May 28, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+