For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Kohli vs Babar: బాబర్‌ అజామ్‌ బాగా ఆడుతున్నా...అలా అయితే మాత్రం ప్రపంచకప్‌లో కష్టమే: ఇంజమామ్

Virat Kohli vs Babar Azam: Pakistan Former Captain Inzamam-ul-Haq Not Happy With Babar Strike Rate

కరాచీ: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్‌ అజామ్‌ బాగా ఆడుతున్నాడని ప్రశంసిస్తూనే అతడిపై చురకలు వేశారు పాక్ మాజీ సారథి ఇంజమామ్ ఉల్ హ‌క్. గత రెండు సంవత్సరాలుగా బాబర్‌ బాగా ఆడుతున్నడని, స్ట్రైక్ రేట్ మాత్రం తక్కువగా ఉందన్నారు. తక్కువ స్ట్రైక్ రేట్‌తో టీ20 ప్రపంచకప్‌ 2021లో ఆడితే మాత్రం మూల్యం చెలించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. యూఏఈ, ఒమన్‌ వేదికగా టీ20 ప్రపంచకప్‌ జరుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం క్వాలిఫైయర్ మ్యాచులు జరుగుతున్నాయి.

అక్టోబ‌ర్ 23న సూప‌ర్ 12 స్టేజ్ ఆరంభం అవుతుంది. పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా అబుదాబిలో జ‌ర‌గ‌బోయే తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు త‌ల‌ప‌డ‌తాయి. గ్రూప్ 2లో భాగంగా అక్టోబ‌ర్ 24న భారత్, పాకిస్థాన్ మ‌ధ్య దుబాయ్‌లో తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

41 బంతుల్లో 50 రన్స్:

41 బంతుల్లో 50 రన్స్:

ప్రాక్టీస్ మ్యాచులో భాగంగా వెస్టిండీస్‌తో పాకిస్తాన్ తాజాగా తలపడింది. ఆ లో స్కోరింగ్ మ్యాచులో పాక్ గెలిచినా.. చాలా బంతులు ఆడింది. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. పాకిస్తాన్ 15.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫకర్ జమాన్ 24 బంతుల్లో 46 పరుగులు చేశాడు.

పాక్ కెప్టెన్ బాబర్‌ అజామ్‌ హాఫ్ సెంచరీ చేసేందుకు 41 బంతులను ఆడాడు. మరో స్టార్ బ్యాటర్ మొహ్మద్ రిజ్వాన్ 17 బంతుల్లో 13 పరుగులు చేశాడు. రిజ్వాన్ ఒకే బౌండరీబాదాడు. మరోవైపు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం ఐపీఎల్ 2021, ప్రాక్టీస్ మ్యాచులలో మంచి స్ట్రైక్ రేట్‌తో ఆడాడు. అందుకే బాబర్ స్ట్రైక్ రేట్‌ను మెరుగుపరుచుకోవాలని ఇంజమామ్ ఉల్ హ‌క్ సూచించాడు. గత కొంతకాలంగా తరచూ కోహ్లీతో బాబర్‌ను పోల్చుతున్న విషయం తెలిసిందే.

స్ట్రైక్ రేట్‌ మెరుగుపరుచుకోవాలి

స్ట్రైక్ రేట్‌ మెరుగుపరుచుకోవాలి

పాక్ మాజీ సారథి ఇంజమామ్ ఉల్ హ‌క్ తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ... 'బాబర్ అజామ్‌ మరియు మొహ్మద్ రిజ్వాన్ గత రెండు సంవత్సరాలుగా చాలా బాగా ఆడారు. కానీ ఇద్దరూ తమ స్ట్రైక్ రేట్ పెంచుకోవాలని నేను ఇప్పటికీ భావిస్తున్నాను. పాకిస్తాన్ బాబర్ మరియు రిజ్వాన్‌పై ఎక్కువగా ఆధారపడుతోంది.

వారు మంచి స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేయకపోతే.. జట్టు కష్టాలను ఎదుర్కొంటుంది. మొదటి ఆరు ఓవర్లను వారు సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా టాప్ జట్లతో ఆడేటప్పుడు. వెస్టిండీస్‌పై పాకిస్తాన్ నాలుగు ఓవర్లు ఉండగానే గెలిచింది. కానీ దానికి కారణం మాత్రం ఫఖర్ జమానే. ఇప్పటికైనా బాబర్, రిజ్వాన్ స్ట్రైక్ రేట్ పెంచుకోవాలి. లేదంటే ప్రపంచకప్‌లో ముందుకు వెళ్లడం కష్టమవుతుంది' అని అన్నాడు.

అంచనాలకు అందని జట్టు

అంచనాలకు అందని జట్టు

అంచనాలకు అందని క్రికెట్‌ జట్టు ఏదైనా ఉందంటే అది పాకిస్థాన్‌ అని కచ్చితంగా చెప్పొచ్చు. ఆటగాళ్లు ఎప్పుడు ఎలా ఆడతారో ఊహించడం కష్టమే. ఒక మ్యాచ్‌లో అద్భుతంగా ఆడితే.. తరువాతి మ్యాచ్‌లో ఒక్కసారిగా కుప్పకూలతారు. అలా అని వారిని తక్కువ అంచనా వేయకూడదు. అయితే టీ20ల్లో పాక్‌కు తిరుగులేని రికార్డు ఉంది.

గత ఐదు టీ20 సిరీసుల్లో నాలుగింటిని కైవసం చేసుకుంది. 2009లో ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను పాక్‌ గెలుచుకుంది. అయితే ఐసీసీ ప్రపంచకప్‌ టోర్నమెంట్లలో టీమిండియా చేతిలో మాత్రం పాక్‌కు ఓటమి తప్పడం లేదు.

ఏడుసార్లు తలపడగా

ఏడుసార్లు తలపడగా

టీ20 ప్రపంచకప్‌ 2021లో ఐదుసార్లు, వన్డే ప్రపంచకప్‌లో ముఖాముఖిగా ఏడుసార్లు తలపడగా.. అన్నింట్లోనూ భారత్‌ విజయం సాధించింది. 2007 నుంచి జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ చేతిలో పాక్‌కు ఓటమి తప్పడం లేదు. ఈ సారైనా భారత్ మీద పాకిస్తాన్ గెలవాలని ఆ దేశ మాజీ క్రీడాకారులు, అభిమానులు కోరుకుంటున్నారు. ప్రపంచకప్‌ 2021లో భాగంగా భారత్‌, పాక్‌ అక్టోబర్ 24న తలపడనున్నాయి. ఈ హై హోల్టేజ్ మ్యాచ్ గురించి అందరూ ఎదురుచూస్తున్నారు. ప్రపంచకప్‌లో ఇదే అతిపెద్ద మ్యాచ్ కానుందని విశ్లేషకులు అంటున్నారు.

Story first published: Wednesday, October 20, 2021, 15:31 [IST]
Other articles published on Oct 20, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+