Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీకి ఆడమ్ జంపా ఫీవర్: వన్డేలు, టీ20ల్లో కలుపుకుని మొత్తం 7 సార్లు ఔట్!

 Virat Kohli vs Adam Zampa in ODIs: Kohli Got Dismissed 7 Times By Zampa

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఆసీస్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా నైట్‌మేర్‌గా మారాడు. రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో హాఫ్ సెంచరీ చేసి దూకుడు మీదున్న విరాట్ కోహ్లీని ఆడమ్ జంపా పెవిలియన్‌కు చేర్చాడు. జంపా బౌలింగ్‌లో కోహ్లీ(76 బంతుల్లో 78, 6 ఫోర్లు)మిచెల్ స్టార్క్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ఫలితంగా ఆడమ్ జంపా బౌలింగ్‌లో వన్డేలు, టీ20ల్లో కలుపుకుని విరాట్ కోహ్లీ ఔట్ కావడం ఇది ఏడో సారి. వన్డేల విషయానికి మాత్రమే వస్తే ఆడమ్ జంపా 5 సార్లు విరాట్ కోహ్లీని పెవిలియన్‌కు చేర్చాడు. వన్డేల్లో విరాట్ కోహ్లీని అత్యధికంగా వెస్టిండిస్‌కు చెందిన రవి రాంపాల్ 6 సార్లు ఔట్ చేశాడు. ఇది ఏ బౌలర్‌కైనా ఇదే అత్యధికం.

విరాట్ కోహ్లీని అత్యధిక సార్లు ఔట్ చేసిన బౌలర్లు వీరే

ఇక, శ్రీలంకకు చెందిన తిసారా పెరెరా, న్యూజిలాండ్‌కు చెందిన టిమ్ సౌతీ వన్డేల్లో విరాట్ కోహ్లీని 5 సార్లు ఔట్ చేసిన మరో ఇద్దరు బౌలర్లు. తాజాగా, విరాట్ కోహ్లీని అత్యధిక సార్లు ఔట్ చేసిన బౌలర్‌గా జంపా ఖాతాలో ఓ అరుదైన రికార్డు నమోదైంది. ఒక బ్యాట్స్‌మన్‌ను ఎక్కువసార్లు ఔట్‌ చేసిన జంపా బౌలింగ్‌ గణాంకాల్లో ఇదే అత్యధికం కావడం విశేషం.

రెండో స్థానంలో రోహిత్ శర్మ

రెండో స్థానంలో రోహిత్ శర్మ

విరాట్ కోహ్లీ తర్వాత రెండో స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. ఇదే మ్యాచ్‌లో టీమిండియా జట్టు స్కోరు 81 పరుగుల దగ్గర రోహిత్ శర్మ(42) ఔటయ్యాడు. ఆడమ్‌ జంపా వేసిన ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌ మూడో బంతికి రోహిత్‌ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. జంపా వేసిన బంతిని రివర్స్‌ స్వీప్‌ ఆడటానికి యత్నించగా అది రోహిత్‌ ప్యాడ్లకు తాకింది.

మూడు వికెట్లు తీసిన ఆడమ్ జంపా

ఆసీస్ ఫీల్డర్లు అప్పీలు చేయగా ఫీల్డ్‌ అంపైర్ ఔటిచ్చాడు. దీనిపై రివ్వూకు వెళ్లిన రోహిత్‌కు అక్కడ కూడా నిరాశే ఎదురైంది. జంపా బౌలింగ్‌లో రోహిత్ శర్మ ఔట్ కావడం నాలుగోసారి. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ మరో 4 పరుగులు చేసి ఉంటే 9000 పరుగుల క్లబ్‌లో చేరేవాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా కోల్పోయిన 5 వికెట్లలో మూడు జంపాకే దక్కడం గమనార్హం.

తొలి వన్డేలో కూడా జంపా బౌలింగ్‌లోనే

కాగా, ముంబై వేదికగా జరిగిన తొలి వన్డేలో సైతం కోహ్లీ... జంపా బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. ఇదిలా ఉంటే, రెండో వన్డేలో ఆస్ట్రేలియాకు టీమిండియా 341 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. శిఖర్‌ ధావన్‌(96; 90 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్‌), విరాట్‌ కోహ్లీ(78;76 బంతుల్లో 6 ఫోర్లు), కేఎల్‌ రాహుల్‌( 80; 52 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్‌ శర్మ(42; 44 బంతుల్లో 6ఫోర్లు)లు రాణించడంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది.

Story first published: Friday, January 17, 2020, 17:45 [IST]
Other articles published on Jan 17, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+