న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆస్ట్రేలియా కవ్విస్తే.. భారత్‌ కూడా సిద్ధంగా ఉందన్న కోహ్లీ

India vs Australia 2018: Virat Kohli promises To Give Back If Australia Is Combative.
 Virat Kohli vows to give it back if Aussies are aggressive

హైదరాబాద్: సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనలో ఆసీస్ ఆటగాళ్లు కవ్వింపులకి దిగితే తాము కూడా ధీటుగా బదులిస్తామని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియా పర్యటన కోసం టీమిండియా గురువారం భారత్ నుంచి బయల్దేరనున్న నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు.

<strong>ఐపీఎల్ 2019: సాహా ఔట్... సన్‌రైజర్స్ రిటైన్ జాబితాలో డేవిడ్ వార్నర్</strong>ఐపీఎల్ 2019: సాహా ఔట్... సన్‌రైజర్స్ రిటైన్ జాబితాలో డేవిడ్ వార్నర్

ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు కోహ్లీ బదులిస్తూ "ఆస్ట్రేలియా పర్యటనలో ఆట తప్ప.. అనవసర విషయాల జోలికి వెళ్లాల్సిన అవసరం మాకు లేదు. వాళ్లు కవ్వింపులకి దిగుతూ, గొడవలకి ప్రయత్నిస్తే? మేము కూడా అదే విధంగా బదులిస్తాం. ఇప్పుడు క్రికెట్‌ పోకడ కూడా అలానే ఉంది. మేము సాధ్యమైనంత వరకూ పర్యటనలో వారికి పోటీనిస్తూ, ఆటపైనే దృష్టి నిలిపేందుకు ప్రయత్నిస్తాం" అని అన్నాడు.

 నవంబర్ 21 నుంచి భారత్-విండిస్ జట్ల మధ్య టీ20 సిరిస్

నవంబర్ 21 నుంచి భారత్-విండిస్ జట్ల మధ్య టీ20 సిరిస్

నవంబర్ 21 నుంచి ఆరంభమయ్యే మూడు టీ20ల సిరిస్‌తో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య సుదీర్ఘ పర్యటన ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 4 టెస్టులు, 3 వన్డేల సిరిస్ ఆడనుంది. స్వదేశంలో పర్యాటక వెస్టిండీస్‌ జట్టును చిత్తుచేసిన టీమిండియా ఇప్పుడు ఆత్మ విశ్వాసంతో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తోంది.

ఆసీస్ గడ్డపై ఏ భారత కెప్టెన్ సాధించని ఘనతను

ఆసీస్ గడ్డపై ఏ భారత కెప్టెన్ సాధించని ఘనతను

ఆస్ట్రేలియా గడ్డపై ఇప్పటి వరకు ఏ భారత కెప్టెన్ సాధించని ఘనతను అందుకోవాలని విరాట్ కోహ్లీ ఉవ్విళ్లూరుతున్నాడు. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు భారత్ ఒక్క టెస్ట్ సిరీస్‌ను కూడా గెలవలేదు. ఈసారి ఎలాగైనా టెస్ట్ సిరీస్‌ను గెలిచి కెప్టెన్‌గా చరిత్రలో నిలిచిపోవాలని విరాట్ కోహ్లీ చూస్తున్నాడు.

ఆసీస్ పర్యటనలో భారత టీ20 జట్టు:

ఆసీస్ పర్యటనలో భారత టీ20 జట్టు:

విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, చాహల్, వాషింగ్టన్ సుందర్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, ఖలీల్ అహ్మద్

ఆసీస్ పర్యటనలో భారత టెస్ట్ జట్టు:

ఆసీస్ పర్యటనలో భారత టెస్ట్ జట్టు:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, లోకేశ్ రాహుల్, పృథ్వీ షా, చతేశ్వర్ పుజారా, ఆజింక్య రహానే, హనుమ విహారి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, పార్థివ్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్

Story first published: Thursday, November 15, 2018, 18:54 [IST]
Other articles published on Nov 15, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X