అడిలైడ్: భారత్ - పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఇరు దేశాల ప్రజలు ఎంతో ఉత్కంఠగా చూస్తారు. అదీ ప్రపంచకప్‌లో ఈ దేశాల మధ్య మ్యాచ్ అంటే ఎంత వేడే గతంలో చూశాం.. ఇప్పుడు కూడా కనిపిస్తోంది. ఆదివారం జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
భారత్ రోహిత్ శర్మ రూపంలో ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. అయితే, ఆ తర్వాత కోహ్లీ - శిఖర్ ధావన్‌లు నిలదొక్కుకున్నారు. ఆచితూచి దూకుడుగా ఆడుతున్నారు.

ఓ దశలో పాకిస్తాన్ ప్లేయర్ సోహిల్ ఖాన్ భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కోహ్లీని ఉద్దేశించి ఏమో అన్నాడు. అయితే, కోహ్లీ మాత్రం తన పని తాను చేస్తున్నాడు. ఆయన వ్యాఖ్యలకు నవ్వే సమాధానంగా ఇచ్చాడు.