ఆ మ్యాచ్ కోసం నా టీ20 రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటా: విరాట్ కోహ్లీ
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సర్‌ప్రైజ్ న్యూస్ చెప్పాడు. తన ఫ్యాన్స్ కోసం టీ20ల్లోకి మళ్లీ వెనక్కి తిరిగొస్తానన్నాడు. ఇప్పటికే విరాట్ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు యూటర్న్ తీసుకుని తన ఆలోచనను మార్చుకుంటానని చెప్పాడు. ఎందుకంటే?
128 ఏళ్ల తర్వాత 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ ను చేర్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ మెగా క్రీడల్లో భారత జట్టు ఫైనల్ కు అర్హత సాధిస్తే.. అప్పుడు రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటానని చెప్పాడు. ఆ ఒక్క మ్యాచ్ కోసం తన వీడ్కోలును పక్కన పెట్టి ఆడతానని విరాట్ అన్నాడు.
ఒలింపిక్స్ కోసం మీరు రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటారా అని అడిగిన ప్రశ్నకు మాట్లాడుతూ.. "లేదు. కానీ ఒకవేళ గోల్డ్ మెడల్ మ్యాచ్ కు భారత్ అర్హత సాధిస్తే.. ఆ ఒక్క మ్యాచ్ కోసం రిటైర్మెంట్ వెనక్కి తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తాను. మ్యాచ్ గెలిచి గోల్డ్ మెడల్ తో స్వదేశానికి తిరిగొస్తాను" అని కోహ్లీ చెప్పాడు. ఆర్సీబీ ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియన్ స్పోర్ట్స్ సదస్సులో కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశాడు.
రిటైర్మెంట్ గురించి మాట్లాడుతూ.. ఆందోళన పడొద్దు. నేను ఎటువంటి రిటైర్‌మెంట్ ప్రకటనలు చేయట్లేదు. ప్రస్తుతం అంతా బానే ఉంది. నేను ఇంకా క్రికెట్ ఆడటాన్ని ఆస్వాదిస్తున్నాను. రిటైర్మెంట్ గురించి పాత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో కూడా మాట్డాడాను. 'నీ మనసు చెప్పిందే అనుసరించు' అని నాతో చెప్పాడు.
"కెరీర్ ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నప్పుడు జీవితంలో మనం ఎక్కడ ఉన్నామో అని ఆలోచిస్తే, దానికి సమాధానం దొరకదు. కానీ ఆడాలని ఉండే తపన రిటైర్మెంట్ ఆలోచనలపై మనల్ని ముందుకు సాగనీయదు. మరో నెల.. మరో ఆరు నెలలు అంటూ ముందుకు వెళ్లిపోతాం. ఇప్పటికైతే చాలా ఆనందంగా ఉన్నాను." అని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు.

- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications