ఫ్యాన్స్‌కు మెసేజ్: యువతకు ఆదర్శంగా కోహ్లీ (వీడియో)
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ యూత్‌కి ఐకానే కాదు ఫిట్‌నెస్ పరంగా యువ ఆటగాళ్లకు ఆదర్శంగా నిలుస్తుంటాడు. ఇప్పటికీ జిమ్‌లో గంటల తరబడి కసరత్తు చేస్తూ.. తన ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలను అభిమానుల కోసం ట్విట్టర్‌లో పోస్టు చేస్తుంటాడు.
తాజాగా శ్రీలంకతో వన్డే సిరీస్ గెలిచిన తర్వాత సోమవారం జట్టు సభ్యులు విశ్రాంతి తీసుకుంటే, విరాట్ కోహ్లీ మాత్రమే జిమ్‌లో సాధన చేస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియోని కోహ్లీ తన ట్విట్టర్‌లో పోస్టు చేసి యువతకు ఓ సందేశాన్ని కూడా ఇచ్చాడు.

"కష్టపడి పనిచేయడాన్ని ఎప్పుడూ ఆపకండి. ప్రతిరోజూ కౌంట్ అయ్యేలా చూడండి" అని కామెంట్ పోస్టు చేశాడు. ఇటీవలే కోహ్లీ జిమ్‌లో కసరత్తలు చేస్తున్న వీడియోని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసిన సంగతి తెలిసిందే.
ఆతిథ్య శ్రీలంకతో జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్‌ను 3-0తో కోహ్లీసేన కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో జట్టులో మార్పులు చేయనున్నట్టు కోహ్లీ చెప్పాడు. తొలి మూడు వన్డేల్లో ఒకే జట్టుతో భారత్ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.
దాంతో మిగిలిన మ్యాచ్‌ల్లో మనీష్ పాండే సహా రిజర్వ్ ఆటగాళ్లకు తుది జట్టులో చోటు లభించనుంది. 'మాది 15 మంది సభ్యుల బృందం. సిరీస్ గెలిచినందున మిగిలిన క్రికెటర్లకూ అవకాశాలు ఇవ్వాలనుకుంటు న్నాం' అని మూడో వన్డే అనంతరం విరాట్ కోహ్లీ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications