Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అరుదైన గౌరవం: విజ్డెన్ కవర్ పేజిపై కోహ్లీ ముఖచిత్రం

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. 2017 సంవత్సరానికి గాను ప్రఖ్యాత విజ్డెన్ పత్రిక తన కవర్‌పేజీపై విరాట్ కోహ్లీతో కూడిన ముఖ చిత్రాన్ని ప్రచురించింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కోహ్లీ గతేడాది మొత్తం 2595 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

ముంబై వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టు సందర్భంగా కోహ్లీ కొట్టిన రివర్స్ స్వీప్ షాట్ ఈ మ్యాగజైన కవర్ పేజీపై ముద్రించింది. ఈ టెస్టులో కోహ్లీ తన కెరీర్‌లోనే అత్యధిక స్కోరు (235 పరుగులు) సాధించిన సంగతి తెలిసిందే. విజ్డెన్ ఎడిటర్ లారెన్స్ బూత్ మాట్లాడుతూ విరాట్ కోహ్లీ సరికొత్త అధునిక క్రికెటర్ అనే నిజాన్ని అందరూ గుర్తించాలని అన్నారు.

కోహ్లీ క్రికెట్‌లో కొత్త విప్లవాన్ని తీసుకొచ్చాడు

కోహ్లీ క్రికెట్‌లో కొత్త విప్లవాన్ని తీసుకొచ్చాడు

ఇటీవలి కాలంలో కోహ్లీ క్రికెట్‌లో కొత్త విప్లవాన్ని తీసుకొచ్చాడని ప్రశంసలు కురిపించాడు. విజ్డన్ కవర్ పేజిపై విరాట్ కోహ్లీ ఫొటోను ప్రచురించేందుకు ఇదే సరైన సమయం. క్రికెట్‌లో చాలా వేగంగా మార్పులు వస్తున్నాయి. దానిని ప్రతిబింబించేలా చేయాలంటే కోహ్లీ ముఖ చిత్రం ఉండటమే సరైంది అని లారెన్స్ బూత్ పేర్కొన్నారు.

సచిన్ తర్వాత కోహ్లీనే

సచిన్ తర్వాత కోహ్లీనే

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తర్వాత గత నాలుగు ఎడిషన్లలో విజ్డెన్ కవర్ పేజిపై కనిపించిన రెండో క్రికెటర్ విరాట్ కోహ్లీ. అంతర్జాతీయ క్రికెట్‌కు సచిన్ టెండూల్కర్ వీడ్కోలు పలికిన అనంతరం 2014లో సచిన్‌ ముఖచిత్రాన్ని తన కవర్ పేజిపై ముద్రించింది.

2016లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు

2016లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు

మూడు ఫార్మెట్లలో కలిపి విరాట్ కోహ్లీ 2016లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు. మొత్తం 41 ఇన్నింగ్స్‌ల్లో 86.50 యావరేజితో కోహ్లీ 2595 పరుగులు చేశాడు. అందులో ఏడు సెంచరీలు, 13 అర్ధసెంచరీలు ఉన్నాయి.

ఇంగ్లాండ్‌పై టెస్టు, వన్డే, టీ20 సిరిస్‌లలో విజయం

ఇంగ్లాండ్‌పై టెస్టు, వన్డే, టీ20 సిరిస్‌లలో విజయం

కెప్టెన్‌గా ధోని పగ్గాలు చేపట్టిన తర్వాత టీమిండియాకు అనేక అద్భుత విజయాలనందించాడు. 2016లో కోహ్లీ వరుసగా వెస్టిండిస్ (2-0), న్యూజిలాండ్ (3-0), ఇంగ్లాండ్ (4-0)తో సిరిస్‌లను సాధించాడు. టెస్టు సిరిస్ అనంతరం ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే, టీ20 సిరిస్‌లను సైతం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా సొంతం చేసుకుంది.

2016లో కోహ్లీ సాధించిన రికార్డులు:

2016లో కోహ్లీ సాధించిన రికార్డులు:

వేగంగా 25 వన్డే సెంచరీలు

వన్డేల్లో వేగంగా 2500 పరుగులు

రన్ ఛేజింగ్‌లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 14 సెంచరీల రికార్డు సమం

ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు

ఒక ఏడాదిలో ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు

మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక భారత టెస్టు కెప్టెన్

ఒక కేలండర్ ఇయర్‌లో డాన్ బ్రాడ్మన్, రికీ పాంటింగ్‌ల తర్వాత మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఆటగాడు

ఒక కేలండర్ ఇయర్‌లో 9 టెస్టు విజయాలను నమోదు చేసిన భారత కెప్టెన్

వరుసగా ఐదు టెస్టు సిరిస్‌లను గెలిచిన భారత కెప్టెన్

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+