Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గ్రీన్ వికెట్ అడిగితే ఇలా చేస్తారా?: ప్రాక్టీస్ పిచ్‌పై కోహ్లీ అసహనం

Virat Kohli unhappy with practice pitch in South Africa, asks for green wicket

హైదరాబాద్: టీమిండియా ప్రాక్టీస్‌ సెషన్‌ కోసం కేటాయించిన పిచ్‌ ఏమాత్రం బాలేదంటూ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరిస్‌కు ముందు ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్ లేకపోవడంతో నెట్ ప్రాక్టీస్ కోసం టీమిండియా కేప్‌టౌన్‌లోని వెస్ట్రన్‌ ప్రొవెన్స్‌ క్రికెట్‌ క్లబ్‌ను కేటాయించారు.

గత రెండు రోజులుగా అక్కడే ప్రాక్టీస్ చేస్తున్న టీమిండియా ఆదివారం వర్షం కారణంగా ఇండోర్‌లో ప్రాక్టీస్ చేసింది. ఈ నేపథ్యంలో కోహ్లీ మాట్లాడుతూ తాము పచ్చిక కూడిన పిచ్‌ను అడిగితే, ఏ మాత్రం జీవం లేని పిచ్‌ను తయారు చేశారని పేర్కొన్నాడు. ఈ తరహా పిచ్‌లు టెస్టు మ్యాచ్‌ ప్రాక్టీస్‌కు ఎంతమాత్రం సరైనవి కావని తేల్చి చెప్పాడు.

'నెట్ ప్రాక్టీస్‌లో భాగంగా తాము ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్న పిచ్ తొలి టెస్టు ఆడబోయే పిచ్‌కు 15 శాతం కూడా సరిపోదు. ఇక్కడ మాకు ఉన్న ఓకే ఒక్క ఆప్షన్‌ సాధ్యమైనంత ఎక్కువ నీటితో తడిపిన పిచ్‌తో పాటు గట్టిగా చదును చేసిన పిచ్‌ కావాలని కోరాం. ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా పేస్‌ బౌలింగ్‌ను ప్రాక్టీస్‌ చేయడానికి పిచ్‌ను తయారుచేయమన్నాం' అని కోహ్లీ అన్నాడు.

Don't Take Too Much Pressure, Just Enjoy - Kohli To U-19 WC Team

'అయితే ప్రాక్టీస్‌ సెషన్‌ కోసం తయారు చేసిన పిచ్‌ ఎటువంటి జీవం లేకుండా ఉంది. ఈ తరహా పిచ్‌పై నాణ్యమైన గేమ్‌ జరుగుతుందా లేదా అనేది కచ్చితంగా చెప్పలేం. రెండు రోజుల గేమ్‌ మాత్రమే ఉన్నప్పుడు ఇటువంటి పిచ్‌లు తయారు చేస్తారు. క్రీజ్‌లోకి వచ్చిన ఆటగాళ్లు తొందరగా యాభై పరుగులు చేయడం, ఆపై పెవిలియన్‌కు పరిమితం కావడానికే ఈ తరహా పిచ్‌లు రూపొందిస్తారు' అని కోహ్లీ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు.

ప్రాక్టీస్‌ సెషన్‌ పిచ్‌పై టీమిండియా అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని వెస్ట్రన్‌ ప్రొవెన్స్‌ క్రికెట్‌ క్లబ్‌ (డబ‍్యూపీసీసీ) కూడా ధృవీకరించింది. వారు పూర్తి పచ్చికతో కూడిన పిచ్‌ను తయారు చేయమన్న వాస్తవమేనని, కాకపోతే దానిని తయారుచేయడానికి శతవిధాలా ప్రయత్నించామని డబ‍్యూపీసీసీ హెడ్ గ్రౌండ్స్‌మన్ ఆండ్రూ మ్యాథ్యూస్ అన్నాడు.

'టీమిండియా మేనేజ్‌మెంట్ తమ జట్టు ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసేందుకు గాను గ్రీన్ వికెట్‌ను రూపొందించమని అడిగింది. అయితే వారు అడిగిన విధంగా బ్యాలెన్స్‌ చేస్తూ పిచ్‌ను రూపొందించడానికి ప్రయత్నించినప్పటికీ అలా జరగలేదు. ఇక్కడి ప్రాక్టీస్ చేస్తే న్యూలాండ్స్‌తో తప్పక రాణిస్తారు' అని తెలిపాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, January 1, 2018, 14:46 [IST]
Other articles published on Jan 1, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+