ధోనీకి రెండో వన్డే అచ్చిరాలేదంతే!: మద్దతుగా నిలిచిన కోహ్లీ


హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తుతోన్న వేళ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి మద్దతుగా నిలిచాడు. ప్రస్తుతం కోహ్లీసేన ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ మధ్య శనివారం లార్డ్స్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ ఓటమికి ధోనియే కారణమంటూ విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో ధోని 59 బంతుల్లో 37 పరుగులు మాత్రమే చేశాడు. అందులో రెండు బౌండరీలు మాత్రమే ఉన్నాయి. 323 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా వెనువెంటనే టాపార్డర్ వికెట్లు చేజార్చుకుంది. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన ధోని నెమ్మదిగా ఆడాడు. డెత్ ఓవర్లలో ఫ్లంకెట్ వేస్తున్న బంతులను బాదకుండా ధోని డిఫెండ్ మాత్రమే చేశాడు.

ధోని దూకుడుగా ఆడి ఉండి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా
దీనిని చూసి అసహనానికి గురైన కొందరు అభిమానులు మైదానంలోనే విమర్శలు చేశారు. 86 పరుగుల తేడాతో భారత్ ఈ మ్యాచ్‌లో ఓడిపోయింది. చివర్లో ధోని దూకుడుగా ఆడి ఉండి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో ధోనిపై వచ్చిన విమర్శలపై కోహ్లీ స్పందించాడు.

ధోని ఫామ్ గురించి ప్రశ్నించడం దురదృష్టకరం
"ధోని ఫామ్ గురించి, అతని సామర్థ్యం గురించి ప్రశ్నించడం దురదృష్టకరం. ధోని తన సహజశైలికి భిన్నంగా ఆడినప్పుడు మళ్లీ మళ్లీ ఇలాగే జరుగుతుంటుంది. అతడు ఫెయిలైనప్పుడు మాత్రమే ఇలా విమర్శలు గుప్పిస్తున్నారు. కొద్ది సమయంలోనే జనాలు తమ అభిప్రాయాలను మార్చుకోవడం దురదృష్టకరం" అని కోహ్లీ తెలిపాడు.

మ్యాచ్‌కు మంచి ముగింపు ఇస్తే
"మ్యాచ్‌కు మంచి ముగింపు ఇస్తే అతడిని మించిన ఫినిషర్ మరొకడు లేడు అని అంటారు. అలా జరగనప్పుడు మాత్రం విమర్శిస్తారు. పదే పదే అతని ఫామ్‌పై విమర్శలు చేయడం సరికాదు. క్రికెట్‌లో మంచి రోజులు, గడ్డు రోజులు ఉంటాయి. జట్టులో అందరికంటే అనుభవం ఉన్న ఆటగాడు ధోనీ. అందరు ఆటగాళ్లు అన్ని వేళలా విజయవంతం అవ్వరు" అని అన్నాడు.

ధోనీకి రెండో వన్డే అచ్చిరాలేదంతే
"ధోనీ విషయంలోనూ అదే జరిగింది. ధోనీకి రెండో వన్డే అచ్చిరాలేదంతే. భవిష్యత్తులో అతడు రాణిస్తాడన్న నమ్మకం ఉంది. అతనిపైనే కాదు జట్టులోని అందరి ఆటగాళ్లపైనే ఇదే నమ్మకం" అని కోహ్లీ అన్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే మంగళవారం జరగనుంది. రెండు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో సిరిస్ 1-1తో సమం అయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications