ఫిట్‌నెస్ పరీక్షకు సిద్ధం: విండిస్ పర్యటనకు ముందు యో-యో టెస్టుకు కోహ్లీ


హైదరాబాద్: ఆసియా కప్ నుంచి సెలక్టర్లు విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో మరోసారి తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకునేందుకు సిద్ధమయ్యాడు. వెస్టిండిస్‌తో టెస్టు సిరీస్‌కు ముందు కోహ్లీ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో సెప్టెంబరు 28న యో-యో టెస్టుకు హాజరవనున్నాడని సమాచారం.
శుక్రవారం కోహ్లీకి యో-యో టెస్టు నిర్వహించి తర్వాత భారత పర్యటనకు వచ్చే వెస్టిండిస్‌పై ఆడే జట్టుని ఎంపిక చేసే అవకాశం ఉంది. భారత జట్టులో చోటు దక్కించుకోవాలంటే యో-యో టెస్టులో పాసవ్వడం తప్పనిసరి. గతంలో ఈ టెస్టులో విఫలమైనందుకు ప్లేయర్స్‌ను జట్టులోకి ఎంపిక చేయని సంగతి తెలిసిందే.
ఈ ఏడాది జూన్‌లో అంబటి రాయుడు, షమీ యో-యో టెస్టులో పాల్గొనప్పుడు విఫలమయ్యారు. దీంతో రాయుడు ఇంగ్లాండ్ పర్యటన కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ యో-యో టెస్టులో విఫలం కావడంతో అతడిని జట్టు నుంచి తప్పించిన సంగతి తెలిసిందే.

ఇంగ్లాండ్ పర్యటనలో వెన్నునొప్పితో బాధపడిన కోహ్లీ
ఇక, ఇంగ్లాండ్ పర్యటనలో కెప్టెన్ కోహ్లీ కూడా వెన్నునొప్పితో బాధపడిన సంగతి తెలిసిందే. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో కోహ్లీని వెన్నునొప్పి వేధించింది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ నుంచి సెలక్టర్లు అతడికి విశ్రాంతినిచ్చారు. దీంతో మరోసారి జట్టులోకి రావాలంటే యో-యో టెస్టుకు హాజరవ్వాల్సిందిగా సెలెక్టర్లు సూచించినట్లు తెలుస్తోంది.

యో-యో టెస్టులో అర్హత మార్కు 16.1గా
యో-యో టెస్టులో ప్రతి ఆటగాడికి అర్హత మార్కుని 16.1గా నిర్ణయించారు. కోహ్లీతోపాటు అశ్విన్, ఇషాంత్ శర్మలకు కూడా మరోసారి ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 29న ఈ ఇద్దరు కూడా యో-యో టెస్టుకు హాజరుకానున్నారు. అయితే కీలకమైన ఆస్ట్రేలియా పర్యటనకు ముందు అశ్విన్, ఇషాంత్‌లకు విశ్రాంతినిచ్చే అంశాన్ని కూడా సెలక్టర్లు పరిశీలిస్తున్నారు.

అక్టోబర్ 4 నుంచి వెస్టిండీస్ పర్యటన ప్రారంభం
అక్టోబర్ 4 నుంచి వెస్టిండీస్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్ కోసం బుధవారమే జట్టును ప్రకటించాల్సి ఉంది. అయితే, సెలెక్టర్లు అందుబాటులో లేని కారణంగా సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్, దేవాంగ్ గాంధీ కలిసి ప్రాథమికంగా ఓ జాబితాను సిద్ధం చేశారు. భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య తొలి టెస్టు రాజ్ కోట్ వేదికగా, రెండో టెస్టు హైదరాబాద్ వేదికగా జరగనుంది.

ఆసియా ఫైనల్లో భారత్-బంగ్లాదేశ్
ఆ తర్వాత ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ ఉంటాయి. ఇప్పుడు ఆసియా కప్‌లో భాగంగా దుబాయిలో ఉన్న టీమిండియా ఆటగాళ్లు కూడా స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత యో-యో టెస్టులో పాల్గొనాల్సి వస్తుంది. ఆసియా కప్‌లో భాగంగా ఇప్పటికే భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం దుబాయిలో జరిగే ఫైనల్లో భారత్-బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications