Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తగ్గెదేలే: కెప్టెన్‌గా ఎవ‌రూ అందుకోలేని రికార్డులు విరాట్ కోహ్లీ సొంతం

Virat Kohli Unbelievable Records As a Captain

టీమిండియాకు ఏడేళ్ల‌పాటు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించిన విరాట్ కోహ్లీ ఈ క్ర‌మంలో ఇత‌ర కెప్టెన్లు ఎవ‌రికీ సాధ్యం కానీ ప‌లు రికార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. వ్య‌క్తిగ‌త రికార్డులు కూడా కోహ్లీ సాధార‌ణ ఆట‌గాడిగా కంటే కెప్టెన్‌గా సాధించిన‌వే ఎక్కువ‌గా ఉన్నాయి. అంతేకాకుండా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఇత‌ర భార‌త కెప్టెన్ల‌కు సాధ్యం కానీ రీతిలో విదేశాల్లో అత్య‌ధిక విజ‌యాలు సాధించ‌డం విశేషం.

కెప్టెన్‌గా అత్య‌ధిక విజ‌యాలు

కెప్టెన్‌గా అత్య‌ధిక విజ‌యాలు

భార‌త క్రికెట్ జ‌ట్టుగా 68 టెస్టు మ్యాచ్‌ల్లో నాయ‌క‌త్వం వ‌హించిన విరాట్ కోహ్లీ రికార్డు స్థాయిలో ఏకంగా 40 మ్యాచ్‌ల్లో గెలిపించాడు. 11 మ్యాచ్‌లు డ్రా చేసుకోగా కేవ‌లం 17 మ్యాచ్‌ల్లోనే ఓడింది. దీని ద్వారా టెస్టు క్రికెట్‌లో భార‌త జ‌ట్టుకు అత్య‌ధిక విజ‌యాలు అందించిన కెప్టెన్‌గా కోహ్లీ నిలిచాడు. అంతేకాకుండా అంత‌ర్జాతీయంగా ఓ జ‌ట్టుకు అత్య‌ధిక విజ‌యాలు అందించిన కెప్టెన్ల జాబితాలో కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆస్ట్ర‌లియాలో టెస్టు సిరీస్ గెలిచిన భార‌త జ‌ట్టు.. ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్‌లో అధిక్యంలో నిలిచింది. ఈ ఘ‌న‌త సాధించిన ఒకే ఒక్క ఇండియా కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు.

SENA జ‌ట్లపై అత్య‌ధిక విజ‌యాలు

SENA జ‌ట్లపై అత్య‌ధిక విజ‌యాలు

ఒకే క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో నాలుగు విదేశీ మైదానాల్లో టెస్టు మ్యాచ్‌ల్లో విజ‌యాలు సాధించిన భార‌త‌ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నాడు. 2018లో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్, ఆడిలైడ్‌లో, ఇంగ్లండ్‌లోని నాటింగ్‌లో హామ్‌లో, సౌతాఫ్రికాలోని జోహ‌న్నెస్‌బ‌ర్గ్‌లో విరాట్ కోహ్లీ టెస్టు మ్యాచ్‌ల‌ను గెలిచాడు. అంతేకాకుండా సేన దేశాలుగా పిలువ‌బ‌డే సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్ జ‌ట్ల‌పై అత్య‌ధిక టెస్టు విజ‌యాలు సాధించిన ఆసియా కెప్టెన్‌గా కోహ్లీ నిలిచాడు. అంతేకాకుండా ద‌క్షిణాఫ్రికాలోని ప్ర‌తిష్మాత్మ‌క సెంచూరియ‌న్ గ్రౌండ్‌లో టెస్ట్ మ్యాచ్ గెలిచిన ఒకే ఒక్క ఆసియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ ఘ‌న‌త ప్ర‌స్తుత సౌతాఫ్రిక ప‌ర్య‌ట‌న‌లోనే అందుకున్నాడు. అంతేకాకుండా అంత‌ర్జాతీయ‌గా మూడో కెప్టెన్‌గా నిలిచాడు.

కెప్టెన్‌గా అత్య‌ధిక ర‌న్స్‌

కెప్టెన్‌గా అత్య‌ధిక ర‌న్స్‌

అలాగే భార‌త టెస్ట్ జ‌ట్టు కెప్టెన్‌గా అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. టెస్టు క్రికెట్‌లో కెప్టెన్‌గా 54 స‌గ‌టుతో కోహ్లీ 5864 ప‌రుగులు చేశాడు. ఇందులో 20 సెంచ‌రీలు ఉన్నాయి. అదే సాధార‌ణ ఆట‌గాడిగా 41 స‌గ‌టుతో 2098 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. 7 సెంచ‌రీలు ఉన్నాయి. అంతేకాకుండా సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ‌న్డే సిరీస్‌లు గెలిచాడు. న్యూజిలాండ్‌లో అయితే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 5-0తో వైట్ వాష్ చేయ‌డం గ‌మనార్హం. ఈ ఘ‌న‌త సాధించిన ఏకైక భార‌త కెప్టెన్‌గా నిలిచాడు. అంతేకాకుండా కెప్టెన్‌గా అత్య‌ధిక సెంచ‌రీల‌తోపాటు స‌గ‌టు క‌లిగి ఉన్న ఆసియా కెప్టెన్‌ కూడా కోహ్లీనే.

అత్య‌ధిక కాలం నంబ‌ర్ వ‌న్‌గా..

అత్య‌ధిక కాలం నంబ‌ర్ వ‌న్‌గా..

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భార‌త జ‌ట్టు అత్య‌ధికంగా 42 నెల‌ల‌పాటు టెస్ట్ ఫార్మాట్‌లో నంబ‌ర్ వ‌న్‌గా నిలిచింది. స్వ‌దేశంలో టెస్టుల్లో అత్య‌ధికంగా 24 విజ‌యాలు సాధించిన కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఉన్నాడు. అంతేకాకుండా కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా స్వ‌దేశంలో ఒక్క సారి కూడా టెస్టు సిరీస్ కోల్పోలేదు.

Story first published: Sunday, January 16, 2022, 18:01 [IST]
Other articles published on Jan 16, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+