Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ డబుల్ ధమాకా: అజర్ రికార్డు బద్దలు, ఔట్

అంటిగ్వా: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ సాధించాడు. తన టెస్టు కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ సాధించాడు. అంతేకాదు, టెస్టు క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్సులో కోహ్లీ లంచ్ విరామం తర్వాత వెంటనే అవుటయ్యాడు. గాబ్రియెల్ బౌలింగులో విరాట్ కోహ్లీ 200 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు.

విదేశాల్లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్లలో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. మొహమ్మద్ అజరుద్దీన్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. అజరుద్దీన్ 1990లో న్యూజిలాండ్‌పై అక్లాండ్‌లో 193 పరుగులు చేశాడు. విదేశాల్లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్లు సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే.

Virat Kohli

డబుల్ సెంచరీ చేసిన తర్వాత హెల్మెట్ చేసి, అభివాదం చేసిన కోహ్లీ ఆ తర్వాత మైదానాన్ని ముద్దాడాడు. భారత జట్టు సభ్యులు లేచి నిలబడి హర్షధ్వానాలు చేశారు.

అశ్విన్ తన టెస్టు కెరీర్‌లో ఏడో అర్థ సెంచరీ చేశాడు. వెస్టిండీస్‌పై అతను రెండో అర్థ సెంచరీ సాధించాడు. శుక్రవారం లంచ్ విరామ సమయానికి భారత్ తొలి ఇన్నింగ్సులో భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 404 పరుగులు చేసింది. కోహ్లీ 200 పరుగులతో, అశ్విన్ 64 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు.

ఇంతకు ముందు కోహ్లీ అత్యధిక వ్యక్తిగత సోక్రు 169 పరుగులు. 2014లో అస్ట్రేలియాపై మెల్బోర్న్‌లో జరిగిన మ్యాచులో కోహ్లీ ఈ స్కోరు సాధించాదడు. వెస్టిండీస్‌లో డబుల్ సెంచరీ చేసిన ఐదో ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. అంతకు ముందు సునీల్ గవాస్కర్, వాసిం జాఫర్, సర్దేశాయ్, నవజోత్ సింగ్ సిద్ధూ వెస్టండీస్‌లో డబుల్ సెంచరీ చేశారు..

విదేశాల్లో అత్యధిక సెంచరీలు సాధించిన భారత కెప్టెన్లలో అజరుద్దీన్ రికార్డును కోహ్లీ సమం చేశాడు. అజరుద్దీన్ తొమ్మిదేల్ల పాటు 27 టెస్టు మ్యాచులు ఆడి దాన్ని సాధించగా, కోహ్లీ కేవలం ఏడు మ్యాచుల్లో దాన్ని సాధించాడు. వెస్టిండీస్‌లో అత్యధిక స్కోరు సాధించిన భారత కెప్టెన్‌గా కూడా కోహ్లీ రికార్డు సాధించాడు.అంతకు ముందు రాహుల్ ద్రావిడ్ 2006లో సెయింట్ లూయిస్‌లో 146 పరుగులు చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+