
హైదరాబాద్: భారత్‌లోని పూణె వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ(107; 119బంతుల్లో 10ఫోర్లు, ఒక సిక్సు)సెంచరీకి మించిన స్కోరుతో చెలరేగిన సంగతి తెలిసిందే. హోల్డర్ బౌలింగ్‌లో సింగిల్ తీసి వన్డేల్లో 38 సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరోవైపు భారత్‌లో ఆరు వన్డేల్లో కోహ్లికిది ఐదో సెంచరీ కావడం విశేషం. ఇదిలా ఉండగా ఈ సెంచరీతో అంతర్జాతీయ క్రికెట్‌లో అతను మరో అరుదైన రికార్డు కైవసం చేసుకున్నాడు.
వన్డే క్రికెట్‌లో వరుసగా మూడు సెంచరీలు బాదిన తొలి భారత క్రికెటర్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకూ ఈ ఘనత సంగక్కర, జహీర్ అబ్బాస్, సయీద్ అన్వర్, గిబ్స్, డివిలియర్స్, డికాక్, రాస్ టేలర్, బాబార్ అజాం, బెయిర్ స్టో మాత్రమే సాధించారు. ఈ సందర్భంగా పలువురు క్రీడా ప్రముఖులు విరాట్‌ను ట్విటర్ ద్వారా అభినందించారు.
హ్యాట్రిక్ సెంచరీలతో అరుదైన ఘనత సాధించిన ప్రత్యేక ఆటగాడికి నా అభినందనలు. వెల్ డన్ కోహ్లీ.
చాలా అద్భుతంగా ఆడావు కోహ్లీ. భారత్‌కు అతనో గొప్ప ఆటగాడు.
కోహ్లీ శతకాల సంఖ్య 38. వన్డేల్లో వరుసగా మూడు శతకాలు సాధించిన తొలి భారత ఆటగాడు. ఛాంపియన్ కోహ్లీకి అభినందనలు.
విరాట్ 'రన్ మిషన్' కోహ్లీ.. విరాట్ 'టన్ మిషన్' కోహ్లీ .. వన్డేల్లో వరుసగా మూడు శతకాలు సాధించిన తొలి భారత ఆటగాడు కోహ్లీకి అభినందనలు
హ్యాట్రిక్ శతకాలు సాధించిన కోహ్లీకి ప్రత్యేక అభినందనలు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ఆటగాడు.