Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీకి నాకన్నా దూకుడెక్కువ: గంగూలీ కితాబు

హైదరాబాద్: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ప్రశంసలు కరిపించాడు. అప్పటి వరకు ప్రపంచ క్రికెట్‌లో అండర్ డాగ్స్ ఉన్న భారత క్రికెట్ జట్టుకు దూకుడు నేర్పిన కెప్టెన్‌గా సౌరభ్ గంగూలీని అభివర్ణిస్తారు. తన కెప్టెన్సీలో ప్రత్యర్ధి జట్లతో దూకుడుగా వ్యవహరించేవాడు.

2002లో నాట్‌వెస్ట్‌ సిరీస్‌ గెలిచినప్పుడు క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్‌ మైదానంలో చొక్కా విప్పి గంగూలీ చేసుకున్న సంబరాలను సగటు క్రికెట్‌ అభిమాని ఎవరూ మరిచిపోలేరు. ప్రస్తుతం టెస్టు కెప్టెన్‌ కోహ్లీ గురించి గంగూలీ ఈ స్పందించాడు.

కోహ్లీకి గంగూలీ కితాబు

కోహ్లీకి గంగూలీ కితాబు

అయితే టీమిండియా కెప్టెన్లలో తానే దూకుడైన కెప్టెన్ అనుకుంటే తనకంటే కోహ్లీ రెండు రెట్లు ఎక్కువేనని గంగూలీ కితాబిచ్చాడు. కోల్‌కతాలో ‘గంగూలీ ఫౌండేషన్‌', ‘గంగూలీ క్రికెట్‌ స్కూల్‌' ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొనేందుకు వచ్చిన దాదా మీడియాతో మాట్లాడాడు. వరుస టెస్టు సిరీస్‌ల విజయాలతో భారత్‌ను నడిపిస్తున్న కోహ్లిని అభినందించాడు.

ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశమివ్వడు

ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశమివ్వడు

కెప్టెన్‌గా కోహ్లీ తనకంటే రెండు రెట్ల దూకుడుతో ఆడుతున్నాడని ప్రశంసించాడు. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశమివ్వడు. ఆ దూకుడే అభిమానులను స్టేడియాలకు రప్పిస్తోందని అన్నాడు. సహచరుల్లో స్ఫూర్తినింపుతూ జట్టును ముందుండి నడిపించడమే గాకుండా వరుస విజయాలతో దూసుకెళుతున్నాడు.

 కోహ్లీ పాత్ర మరవలేనిది

కోహ్లీ పాత్ర మరవలేనిది

ముఖ్యంగా ఇంగ్లాండ్ జట్టుపై సిరిస్‌ను కైవసం చేసుకోవడంలో కోహ్లీ పాత్ర మరవలేనిదని గంగూలీ పేర్కొన్నాడు. ఇక పిచ్‌ విజన్‌ క్రికెట్‌ టెక్నాలజీతో పాటు గంగూలీ స్కూల్‌ ప్రారంభమవడంపై దాదా మాట్లాడుతూ సాంకేతికతనేది అటగాడు తన నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకునేందుకే ఉపయోగపడాలని అన్నాడు.

ఈ టెక్నాలజీ బెంగాల్‌ క్రికెట్‌ను కొంత పుంతలు

ఈ టెక్నాలజీ బెంగాల్‌ క్రికెట్‌ను కొంత పుంతలు

‘ఈ పిచ్‌ విజన్‌ టెక్నాలజీ బెంగాల్‌ క్రికెట్‌ను కొంత పుంతలు తొక్కిస్తుంది. కుర్రకారు ప్రతిభా పాటవాలను మరో దశకు తీసుకెళుతుంది. వంద నుంచి నూటయాభై మంది కోచ్‌లతో విద్యార్థులకు క్రికెట్‌ పాఠాలు నేర్పాలనుకుంటున్నాం. ఆర్థికంగా వెనుకబడిన వారికి ఉచితంగా కోచింగ్‌ ఇచ్చేందుకు ప్రణాళికలతో ముందుకు వెళుతున్నాం' అని గంగూలీ చెప్పాడు.

కోహ్లీపై మెక్‌కల్లమ్‌ ప్రశంసలు

కోహ్లీపై మెక్‌కల్లమ్‌ ప్రశంసలు

కోహ్లీ తన అద్భుత ప్రదర్శనతో క్రికెట్‌ను మార్చివేశాడని న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ అన్నాడు. వన్డేలు, టీ20లు, టెస్టులు ఇలా ఏ ఫార్మాట్‌ తీసుకున్నా.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కోహ్లీ అద్భుతంగా ఆడతాడని కొనియాడాడు. కోహ్లీ క్రికెట్‌లో సూపర్‌స్టార్‌ అని.. అతను క్రికెట్‌లో ఉండటం ఆట అదృష్టమని పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయిన మెక్‌కల్లమ్‌ బిగ్‌బాష్‌ లీగ్‌లో ఆడుతున్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+