బాక్సింగ్ డే టెస్టుకు ముందు క్రిస్టమస్ ట్రీట్స్‌తో కోహ్లీ

హైదరాబాద్: ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానులకు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా బుధవారం భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు బుధవారం నుంచి ప్రారంభం కానుంది.
తొలి రెండు టెస్టుల్లో చెరో మ్యాచ్ నెగ్గడంతో సిరిస్ 1-1తో సమం అయింది. ముఖ్యంగా రెండో టెస్టులో ఓటమికి గాను విరాట్ కోహ్లీ ఒత్తిడిలో ఉన్నాడు. పెర్త్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్‌తో కోహ్లీ మాటల యుద్ధానికి దిగడంపై కోహ్లీ తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

మెల్ బోర్న్ వేదికగా మూడో టెస్టు
దీంతో మెల్ బోర్న్ వేదికగా జరగనున్న మూడో టెస్టులో విజయం సాధించి టెస్టు సిరిస్‌లో ఆధిక్యాన్ని సాధించాలని కోహ్లీ భావిస్తున్నాడు. అంతేకాదు విదేశాల్లో కెప్టెన్‌గా తన రికార్డుని సైతం మెరుగుపరచుకోవాలని ఊవిళ్లూరుతున్నాడు. ఈ ఏడాది కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఇప్పటివరకు ఆడిన పది టెస్టుల్లో ఏడింట ఓడిపోయింది.
క్రిస్టమస్ శుభాకాంక్షలు చెప్పిన కోహ్లీ
అయితే, ఎంత ఒత్తిడిలో ఉన్నప్పటికీ కెప్టెన్ కోహ్లీ మాత్రం అభిమానులకు క్రిస్టమస్ శుభాకాంక్షలు చెప్పడం మర్చిపోలేదు. కేకులు, కుకీస్ ఉన్న ట్రేను పట్టుకుని ఉన్న ఫోటోని కోహ్లీ తన ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ అభిమానులకు క్రిస్టమస్ శుభాకాంక్షలు చెప్పాడు. ఈ ఫోటో పోస్టు చేసిన కొద్ది సేపటికే వెయ్యికిపైగా రీట్వీట్స్ వచ్చాయి.

బ్యాటింగ్ చేయాల్సి వస్తే
కాగా, మూడో టెస్టుకు ముందు కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ "ఈ సారి బ్యాట్స్‌మెన్ రాణించడం ఎంతో ముఖ్యం. బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణిస్తుంది. చిన్న టార్గెట్‌లను కూడా చేధించకపోతే బౌలర్స్ ఏం చేయలేరు. ఒక వేళ సెకండ్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే, ఆధిక్యం కోసం ప్రయత్నించాలి" అని కోహ్లీ అన్నాడు.

బాక్సింగ్ డే టెస్టులో కలిసికట్టుగా రాణించాలి
"లేకుంటే కనీసం ఆ స్కోర్‌ను సమం చేయడానికైనా కృషి చేయాలి. రెండో ఇన్నింగ్స్‌లో గెలపుకోసం ప్రయత్నించాలి. తొలుత బ్యాటింగ్ చేస్తే మాత్రం భారీ స్కోర్లు సాధించి విజయావకాశాలను అందిపుచ్చుకోవాలి. దీనికోసం బ్యాట్స్‌మెన్ అంతా కలిసికట్టుగా రాణించాలి. ఏ ఒక్కరో రాణించాలని చెప్పడం లేదు. అందరూ ఐక్యంగా పరుగులు చేయాలి" అని కోహ్లీ చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications