Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హృదయాన్ని హత్తుకునేలా!: సీక్రెట్ శాంటాగా విరాట్ కోహ్లీ (వీడియో)

Virat Kohli Turns Secret Santa For Children of a Shelter Home in Kolkata

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సీక్రెట్ శాంటాగా అవతారమెత్తాడు. తల్లిదండ్రులు లేని చిన్నారులకు అన్నీ తానై వారు కోరిన కోరికలను తీర్చాడు. గేమ్‌లో ఎప్పుడూ బిజీగా ఉండే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రిస్టమస్ పండుగను పురస్కరించుకుని సీక్రెట్ శాంటాలగా మారాడు.

శాంటా లాగా వేషం వేసుకుని కోల్‌కతాలోని షెల్టర్ హోమ్‌లో చిన్నారులకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఈ సందర్భంగా వారు శాంటాను ఏమేమి బహుమతులు అడిగారో అవన్నీ కూడా వారికి శాంటా రూపంలో అందజేశాడు. అనంతరం వారితో కాసేపు సరదాగా గడిపి వారితో ఫోటోలు దిగాడు.

విరాట్ కోహ్లీ సీక్రెట్ శాంటాగా మారి చిన్నారులకు బహుమతులు అందజేసిన వీడియోని స్టార్ స్పోర్ట్స్ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా టీమిండియా ఆదివారం కటక్ వేదికగా వెస్టిండిస్‌తో తలపడనుంది.

ఇప్పటికే ముగిసిన రెండు వన్డేల్లో ఇరు జట్ల చెరో మ్యాచ్ నెగ్గడంలో సిరిస్ 1-1తో సమం అయింది. ఆదివారం కటక్ వేదికగా జరగనున్న మూడో వన్డేలో ఏ జట్టు అయితే గెలుస్తుందో ఆ జట్టు సిరిస్ విజేతగా నిలుస్తుంది.

Story first published: Friday, December 20, 2019, 18:29 [IST]
Other articles published on Dec 20, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+