30వ పడిలోకి కోహ్లీ: సోషల్ మీడియాలో ఎవరేమని ట్వీట్ చేశారంటే!


హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సోమవారం 30వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా కోహ్లీకి సోషల్ మీడియాలో మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తన అద్భుతమైన ఆటతీరుతో ఇప్పటికే అనేక రికార్డులను బద్దలు కొట్టిన కోహ్లీ... రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు సాధించాలని కోరుకుంటున్నారు.
కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారిలో మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ కైఫ్, వీవీఎస్ లక్ష్మణ్‌తో పాటు ప్రస్తుత ఆటగాళ్లు మహ్మద్ షమీ, సురేశ్ రైనా, వృద్ధిమాన్ సాహా, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని తదితరులు ఉన్నారు. మరోవైపు బీసీసీఐ ప్రత్యేకంగా ఓ వీడియోని తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది.
ఇండియా ఛార్మింగ్ లీడర్
వన్డేల్లో అత్యంత వేగంగా పదివేల పరగులు చేసిన ఆటగాడు
టీ20ల్లో అత్యంత వేగంగా రెండువేల పరుగులు చేసిన ఆటాగడు
ప్రస్తుత ప్రపంచంలో మూడు ఫార్మాట్లలో అద్భుతమైన ఆటగాడు
బీసీసీఐ
30వ పుట్టినరోజుని జరుపుకుంటున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. కోహ్లీ క్యాబినెట్‌లోని అద్భుతమైన విన్నింగ్ మూమెంట్స్ మీకోసం...
వీరేంద్ర సెహ్వాగ్
ఈ ధనత్రయోదశి(ధంతేరాస్) రోజున.. నీ మరో ఏడాది రన్‌తేరాస్(పరుగులు)తో నిండిపోవాలని కోరుకుంటున్నా. హ్యాపీ బర్త్‌డే విరాట్ కోహ్లీ
వీవీఎస్ లక్ష్మణ్
నీ జీవితం మొత్తం విజయం, సంతృప్తితో సాగాలని కోరుకుంటున్నా. పుట్టినరోజు శుభాకాంక్షలు విరాట్ కోహ్లీ
సురేశ్ రైనా
క్రికెట్ సామ్రాట్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు
మహ్మద్ కైఫ్
చేతిలో మ్యాజిక్ స్టిక్‌తో ఎలాంటి పరిస్థితినైనా మనకు అనుకూలంగా తెస్తున్నాడు. స్థిరత్వానికి అతడే ఓ ఉదాహరణ. పరుగుల ఆకలికి పునర్నివచనం. హ్యాపీ బర్త్‌డే విరాట్
వృద్ధిమాన్
హ్యాపీ బర్త్‌డే బ్రదర్. ఈ సంవత్సరం కూడా మీకు అద్భుతంగా ఉండాలి.
మహ్మద్ షమీ
పుట్టినరోజు శుభాకాంక్షలు విరాట్ కోహ్లీ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications