For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

30వ పడిలోకి కోహ్లీ: టాప్-5 టెస్ట్ సెంచరీలు మీకోసం ప్రత్యేకం

#HappyBirthdayVirat : Virat Kohli's TOP 5 Best ODI Centuries | Oneindia Telugu
Virat Kohli turns 30: Heres top 5 Test innings of King Kohli

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సోమవారం 30వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా కోహ్లీకి సోషల్ మీడియాలో మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తన అద్భుతమైన ఆటతీరుతో ఇప్పటికే అనేక రికార్డులను బద్దలు కొట్టిన కోహ్లీ... రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

విరాట్ కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారిలో మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌, మహ్మద్‌ కైఫ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌‌తో పాటు ప్రస్తుత ఆటగాళ్లు మహ్మద్‌ షమీ, సురేశ్‌ రైనా, వృద్ధిమాన్‌ సాహా, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని తదితరులు ఉన్నారు. మరోవైపు బీసీసీఐ ప్రత్యేకంగా ఓ వీడియోని తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది.

టెస్టు క్రికెట్‌లోకోహ్లీ టాప్-5 సెంచరీలు మీకోసం:

1. 103, ట్రెంట్‌బ్రిడ్జి - 2018

1. 103, ట్రెంట్‌బ్రిడ్జి - 2018

ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన సిరిస్‌లో టీమిండియా గెలిచిన ఏకైక టెస్టు ఇదే కావడం విశేషం. ట్రెంట్ బ్రిడ్జి వేదికగా జరిగిన ఈ టెస్టులో విరాట్ కోహ్లీ చెలరేగాడు. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన కోహ్లీ రెండో ఇన్నింగ్స్‌లో 97 పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో టీమిండియా గెలిచిన ఏకైక టెస్టు ఇదే కావడం కావడం. ఈ సిరిస్‌ను కోహ్లీసేన 1-4తే చేజార్చుకున్న సంగతి తెలిసిందే.

2. 153, సెంచూరియన్ - 2018

2. 153, సెంచూరియన్ - 2018

ఈ ఏడాది మొదట్లో కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా సఫారీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. సెంచూరియన్ వేదికగా జరిగిన ఈ టెస్టులో కోహ్లీ ఒక్కడే ఫైటింగ్ స్పిరిట్‌తో పోరాడాడు. భారత ఇన్నింగ్స్‌లో ఏ బ్యాట్స్‌మెన్ కూడా హాఫ్ సెంచరీకి పైగా పరుగులు చేయలేదు. కేవలం కోహ్లీ ఒక్కడే సఫారీ పేస్ ఎటాక్ మోర్నీ మోర్కెల్, వెర్నాన్ ఫిన్ లాండర్, కగిసో రబడ, లుంగి ఎంగిడిలను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో కోహ్లీ తన మాస్టర్ క్లాస్‌తో 153 పరుగులు చేశాడు. కోహ్లీ పర్సనల్ బెస్ట్‌లో ఇదొకటి.

3. 115 & 141, అడిలైడ్ - 2014

3. 115 & 141, అడిలైడ్ - 2014

కోహ్లీ కెరీర్‌లోనే ఈ పర్యటన ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే అడిలైడ్ వేదికగా జరిగిన ఈ టెస్టులో కోహ్లీ రెండు సెంచరీలతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ 115 పరుగులతో రాణించడంతో టీమిండియా 444 పరగులు చేసింది. ఇక, రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ 175 బంతుల్లో 141 పరుగులతో మరో సెంచరీని నమోదు చేశాడు. ఓపెనర్ మురళీ విజయ్(99) ఒక పరుగు తేడాతో సెంచరీని కోల్పోయాడు. ఇక, ఆతిథ్య జట్టులో సైతం డేవిడ్ వార్నర్ 145, 102 పరుగులతో రెండు సెంచరీలు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ ఏడు వికెట్లతో చేలరేగడంతో ఆస్ట్రేలియా 48 పరుగుల తేడాతో విజయం సాధించింది.

4. 204, హైదరాబాద్ - 2017

4. 204, హైదరాబాద్ - 2017

టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి టీమిండియా స్వదేశంలో బంగ్లాదేశ్‌కు ఆతిథ్యమిచ్చింది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కోహ్లీ డబుల్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. 246 బంతుల్లో కోహ్లీ 204 పరుగులు చేశాడు. కోహ్లీ టెస్టు కెరీర్‌లో ఈ ఇన్నింగ్స్ కూడా అత్యుత్తమం.

5. 169, మెల్‌బోర్న్- 2014

5. 169, మెల్‌బోర్న్- 2014

2014 ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ కోహ్లీ జూలు విదిల్చాడు. మెల్ బోర్న్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ పేసర్ మిచెల్ జాన్సన్ షార్ట్ పిచ్ బంతులతో కోహ్లీ భయపెట్టే ప్రయత్నం చేశాడు. అయితే, కోహ్లీ మాత్రం ఆసీస్ పేసర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ, రహానేలు నాలుగో వికెట్‌కు 262 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆఖరి ఓవర్ల వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌ చివరకు డ్రాగా ముగిసింది. భారత్ తరుపున ధోనికి ఇదే చివరి టెస్టు కావడం విశేషం.

Story first published: Monday, November 5, 2018, 13:28 [IST]
Other articles published on Nov 5, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+