ముద్దు పేరు చీకూ: #HappyBirthdayVirat కోహ్లీ
బెంగుళూరు: భారత టెస్టు కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ శనివారం (నవంబర్ 5)న 28వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీకి అభిమానులు, సహచర ఆటగాళ్లు, మాజీలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.
అభిమానులకు నిత్యం సోషల్ మీడియా ద్వారా టచ్‌లో ఉండే విరాట్ కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీకి చెందిన కోహ్లీ ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో ఓ స్టయిల్ ఐకాన్‌గా మారాడు. అభిమానుల మద్దతుతోనే తాను ఇంతవాడినయ్యానని కోహ్లీ ఎప్పుడూ చెప్తుంటాడు.
అంతేకాదు అభిమానులతో సెల్ఫీలు, ఫోటోలు, ఆటోగ్రాఫ్‌లు ఇచ్చేందుకు ముందుంటాడు. ప్రస్తుతం టీమిండియా టెస్టు కెప్టెన్‌గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ త్వరలో ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్టు సిరిస్‌పై దృష్టి సారించాడు. కోహ్లీకి అపజయాలంటే ఇష్టముండదు.
అందుకేనేమో టీమిండియా ఓటమి పాలవ్వాల్సిన మ్యాచ్‌ల్లో కూడా అడ్డుగోడగా నిలిచి జట్టును గెలిపించిన మ్యాచ్‌లు ఎన్నో మనం చూశాం. 2008లో మలేసియాలో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌ను సాధించి అందరి దృష్టినీ ఆకర్షించిన కోహ్లీ అదే ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.
2009లో వన్‌డౌన్‌లో తన చోటుని పదిలం చేసుకున్నాడు. భారత్ తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా 1000, 3000, 4000 చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు.
మిలియన్ల అభిమానులతో పాటు వన్ఇండియా కూడా భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతోంది. శనివారం నాడు #HappyBirthdayVirat అనే ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్ అవుతోంది. కోహ్లీ బర్త్‌డే సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పాఠకుల కోసం ప్రత్యేకం.

ఫ్యాన్ ఫేవరేట్
విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది అభిమానులు ఉన్నారు. అమెరికాలో భారత్-వెస్టిండిస్ మధ్య జరిగిన టీ20 సిరిస్‌లో అభిమానులతో కలిసి ఫోటోలకు ఫోజులిస్తున్న టెస్టు కెప్టెన్ కోహ్లీ.

టెస్టుల్లో టీమిండియా నెంబర్ వన్
ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరిస్‌ను 3-0తో వైట్ వాష్ చేయడంతో టీమిండియా టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంకుని కైవసం చేసుకుంది. న్యూజిలాండ్‌ను 3-0తో వైట్ వాష్ చేసిన సందర్భంలో కోహ్లీ అభిమానులకు సక్సెస్ సింబల్ చూపుతున్న దృశ్యం.

ధోనికి సలహాలు
టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సలహాలను టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర ధోని సావధానంగా వింటున్న దృశ్యం. ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన వన్డే సిరిస్‌లో కోహ్లీ సలహాలను కావాల్సినప్పుడు తీసుకుంటానని ధోని చెప్పిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరిస్‌లో ధోనికి సలహా ఇస్తున్న కోహ్లీ.

టీమ్ బస్సులో కోహ్లీ
ఇండోర్ టెస్టు మ్యాచ్ సందర్భంగా తన సహచర ఆటగాళ్లతో కలిసి టీమ్ బస్సులో ప్రయాణించిన టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో 3-0తేడాతో భారత్ వైట్ వాష్ చేసిన సంగతి తెలిసిందే.

మైదానంలో దూకుడు స్వభావం ఎక్కువ
మైదానంలో కోహ్లీకి దూకుడెక్కువ. బ్యాట్‌తో అద్భుతమైన షాట్లు ఆడతాడు. వేగంగా సింగిల్స్ తీయగలడు. కళాత్మక డ్రైవ్‌లు, కట్‌లతో అలరించగల సత్తా కోహ్లీకి ఉంది. బౌలర్ నేర్పుగా వేసే యార్కర్‌ను షార్ట్ థర్డ్‌మాన్ కళ్లుగప్పి బౌండరీకి తరలిస్తాడు. బ్యాటింగ్ చేసేప్పుడు బాటమ్‌హ్యాండ్‌ని ఉపయోగించే తీరు అద్భుతం.

డ్రమ్మర్‌గా విరాట్ కోహ్లీ
బెంగుళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ సరదా డ్రమ్ వాయిస్తున్న విరాట్ కోహ్లీ. ఈ ఏడాది భారత్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ అద్భుతమైన ఆటతీరుని కనబర్చాడు. 5 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 136.5 యావరేజితో 273 పరుగులు సాధించాడు. అందులో 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

క్రికెట్ లెజెండ్ సర్ వివియన్ రిచర్డ్స్‌తో కోహ్లీ
మాజీ క్రికెటర్ల పట్ల కోహ్లీ ఎంతో గౌరవాన్ని ప్రదర్శిస్తాడు. ఈ ఏడాది మొదట్లో వెస్టిండిస్ పర్యటన సందర్భంగా సర్ వివియన్ రిచర్డ్స్‌ని కోహ్లీ కలవడం జరిగింది. మరోవైపు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ లాంటి గొప్ప క్రికెటర్లను కలిసినప్పుడు ఆట కంటే మానసిక అంశాలనే ఎక్కువగా తెలుసుకునేవాడినని కోహ్లీ ఒకానొక సందర్భంలో తెలిపాడు.

టీమ్ మ్యాన్
టెస్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రాణిస్తున్న తీరు అద్భుతం. ముఖ్యంగా యువ ఆటగాళ్లకు కోహ్లీ ఎంతో విలువైన సూచనలను ఇస్తుంటాడు. పై చిత్రంలో గనుక మీరు చూస్తే టీమిండియా పేసర్ జప్రీత్ బుమ్రాకు సలహాలిస్తున్న దృశ్యం మీరు చూడొచ్చు.

ఫిట్‌నెస్‌పై పూర్తి స్ధాయిలో దృష్టి
గతంలో కోహ్లీ తన దినచర్యను పెద్దగా పట్టించుకునే వాడు కాదు. అయితే 2012 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తర్వాత ఫిట్‌నెస్‌పై దృష్టి సారించానని చెప్పుకొచ్చాడు. వ్యాయామాన్ని తన జీవితంలో భాగంగా చేసుకున్న తర్వాత ఏ స్ధానంలోనైనా ఫీల్డింగ్ చేయగలుగుతున్నానని చెప్పుకొచ్చాడు.

యోగా కూడా
ఇటీవల బెంగుళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ప్రిపరేషన్ క్యాంపులో యోగా చేస్తున్న టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ. పక్కనే రహానే, ఛటేశ్వర పుజారాలను కూడా చూడొచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications