హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్విట్టర్లో చేసిన పోస్ట్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీచర్స్ డే సందర్భంగా విరాట్ కోహ్లీ పలువురు మాజీ క్రికెటర్లను తన గురువులుగా సంబోధించి గురుపూజోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు. ఈ జాబితాలో టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే పేరు లేదు.
దీంతో నెటిజన్లు కోహ్లీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరు మొట్టమొదటి స్ధానంలో ఉండగా ఆ తర్వాత ధోనీ, కపిల్‌దేవ్, సెహ్వాగ్, గంగూలీ, ద్రవిడ్, లక్ష్మణ్, రికీ పాంటింగ్, వివ్ రిచర్డ్స్ తదితరుల పేర్లు ఉన్న చిత్రాన్ని కోహ్లీ అభిమానులతో పంచుకున్నాడు.
ఈ పేర్ల జాబితాలో అనిల్ కుంబ్లే పేరు లేకపోవడం విశేషం. దీనిని గమనించిన నెటిజన్లు 'కుంబ్లే పేరు మర్చిపోయావా కోహ్లీ?' అంటూ ప్రశ్నించారు. మరికొందరైతే 'గావస్కర్, కుంబ్లే పేర్లు మర్చిపోయావు' అని ఫోటో కింద కామెంట్లను పోస్టు చేశారు. 'కుంబ్లే నుంచి నువ్వు ఏమీ నేర్చుకోలేదా కోహ్లీ?' అంటూ మరికొందరు ప్రశ్నించారు.
To all the teachers around the world and especially to the ones in the Cricket World. 🙏😊 #HappyTeachersDay pic.twitter.com/pvtrBw5uyK
— Virat Kohli (@imVkohli) September 5, 2017
నిజానికి టీమిండియా ప్రధాన కోచ్‌గా అనిల్ కుంబ్లే బాధ్యతలు చేపట్టిన తర్వాత కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా అనేక గొప్ప విజయాలను సొంతం చేసుకుంది. కుంబ్లే కోచ్‌గా ఉన్న సమయంలో టీమిండియా వెస్టిండీస్, న్యూజిలాడ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలపై టెస్టు సిరీస్‌లను కైవసం చేసుకుంది.
ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం కోహ్లీతో అభిప్రాయబేధాల కారణంగా కుంబ్లే తన ప్రధాన కోచ్ పదవికి రాజీనామా చేశాడు. అప్పట్లో కుంబ్లే రాజీనామా పెద్ద సంచలనం అయింది. కుంబ్లే స్ధానంలో 2019 వరల్డ్ కప్ వరకు రవిశాస్త్రిని ప్రధాన కోచ్‌గా బీసీసీఐ నియమించింది.
No name of Sunil Gavaskar and Anil Kumble at backdrop.
— Ameya Tanawade (@ameyatanawade) September 5, 2017
Where us anil kumble ?? Too much ego
— Va$anth V€rn€kar (@VernekarDr) September 5, 2017
However a great fan of @imVkohli
Forgot kumble? 😃
— -CR7 Paaji- (@SatishKakarla7) September 5, 2017
Anil kumble??? 😐
— Subhashree🙋 (@iamsubhashree_) September 5, 2017
how can you expect Kumble in the list 😀
— Prabhas (@Mirchi_Prabhas) September 5, 2017
Don't see Kumble in the list !!
— Rachit (@rachit_vk) September 5, 2017