న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'జీరో' సినిమాపై కోహ్లీ రివ్యూ: క్రికెట్‌పై దృష్టి పెట్ట‌ు అంటూ నెటిజన్ల సెటైర్లు

India vs Australia: Virat Kohli Trolled For Lauding Anushka Sharma's Performance In Zero
Virat Kohli Trolled For Lauding Anushka Sharmas Performance In Zero

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీపై నెటిజన్లు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా, కోహ్లీ సతీమణి అనుష్క శర్మ హీరోయిన్‌గా గత శుక్రవారం విడుదలైన 'జీరో' సినిమాకు మిశ్ర‌మ స్పంద‌న వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఆసీస్ పర్యటనలో ఉన్న కోహ్లీ ఈ సినిమాని చూసి ట్విట‌ర్‌లో త‌న అభిప్రాయాన్ని పంచుకున్నారు.

"''జీరో' చిత్రాన్ని చూశాను. ఎంతో వినోదాత్మకంగా ఉంది. నేను బాగా ఎంజాయ్‌ చేశాను. ఈ చిత్రంలో ఎవరి పాత్రలకు వారు బాగా న్యాయం చేశారు. నాకు అనుష్క శర్మ నటన బాగా నచ్చింది. ఆమెది ఇందులో ఛాలెంజ్‌తో కూడుకున్న పాత్ర అనిపించింది. అమె గొప్ప‌గా న‌టించింది" అని కోహ్లీ తన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. కోహ్లీ ట్వట్‌పై నెటిజ‌న్లు తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు.

ఈ సినిమాకు అత్యంత చెత్త రివ్యూ ఇచ్చావ‌ని.. సినిమాల‌కు రివ్యూలు ఇచ్చే బ‌దులు క్రికెట్‌పై దృష్టి పెట్ట‌డ‌మే మంచిద‌ని విరాట్‌ కోహ్లీకి ఓ నెటిజ‌న్ సూచించాడు. "నీ భార్య సినిమా కన్నా ఆ కేజీఎఫ్‌ చాలా నయం అని ఒకరంటే.. ఈ సినిమా గొడవ ఎందుకు కానీ, ఆ కేఎల్‌ రాహుల్‌ను కొంచెం పట్టించుకో.. లేకుంటే డిసెంబర్‌ 26న మరో జీరోనే" అని మరొకరు కామెంట్‌ చేశారు.

"రెండో టెస్ట్‌ అనంతరం అనుష్క భారత ఆటగాళ్ల ప్రదర్శనను కొనియాడిందా? మరి ఈ చెత్త సినిమా విషయంలో ఆమెను ఎందుకు పొగుడ్తున్నావ్‌?" అని మరొక నెటిజన్ మండిపడ్డాడు. కాగా, నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య డిసెంబర్‌ 26 నుంచి మెల్ బోర్న్ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది.

Story first published: Monday, December 24, 2018, 17:08 [IST]
Other articles published on Dec 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X