విరాట్ కోహ్లీ - ట్రావిస్ హెడ్ గొడవ: స్టార్ సింగర్‌ను ట్రోల్ చేస్తున్నా ఫ్యాన్స్..!
IPL 2026: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ట్రావిస్ హెడ్ మధ్య మొదలైన వాగ్వాదం రోజురోజుకూ ముదురుతోంది. మ్యాచ్ ముగిసిన తర్వాత హెడ్‌కు కరచాలనం (handshake) ఇవ్వడానికి కోహ్లీ నిరాకరించడంతో ఈ గొడవ మరింత పెద్దదైంది.
ఈ గొడవను మనసులో పెట్టుకుని కొందరు కోహ్లీ అభిమానులు ట్రావిస్ హెడ్ భార్య జెస్సికాని టార్గెట్ చేస్తూ వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఒక విచిత్రమైన పొరపాటు కూడా జరిగింది.అభిమానులు ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రావిస్ హెడ్‌కు అమెరికన్ రాపర్ ట్రావిస్ స్కాట్‌కు మధ్య తేడా తెలియక కన్ఫ్యూజ్ అయ్యారు. దీంతో వాళ్లు పొరపాటున రాపర్ ట్రావిస్ స్కాట్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు వెళ్లి ఆయన ఫోటోల కింద కోపంతో నెగెటివ్ కామెంట్లు పెట్టడం స్టార్ట్ చేశారు. ఈ పోస్ట్‌లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.

సోమవారం జెస్సికా హెడ్ ఈ వేధింపులపై స్పందిస్తూ తన బాధను పంచుకున్నారు. కోహ్లీతో తన భర్తకు జరిగిన గొడవ కారణంగానే తనను టార్గెట్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో రోహిత్ శర్మను అవుట్ చేయడానికి ట్రావిస్ హెడ్ అద్భుతమైన క్యాచ్ పట్టినప్పుడు కూడా జెస్సికా ఇలాంటి దుర్భాషలనే ఎదుర్కొన్నారు. ఇప్పుడు జరుగుతున్న వివాదం ఆమెకు ఆ చేదు జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేసింది.
ప్రస్తుతం తాము బాగానే ఉన్నప్పటికీ సోషల్ మీడియా మొత్తం విషపూరిత వ్యాఖ్యలతో నిండిపోయిందని తన స్నేహితులను కుటుంబాన్ని కూడా వేధిస్తున్నారని జెస్సికా ఆస్ట్రేలియన్ మీడియా సంస్థ 'ది అడ్వర్టైజర్'తో చెప్పింది. క్రీడల్లో కోపతాపాలు సహజమే అయినప్పటికీ ఆటగాళ్లకు కూడా కుటుంబాలు ఉంటాయని గుర్తుంచుకోవాలని ప్రతీ ఆటలోనూ ప్లేయర్స్ మానసిక ఆరోగ్యానికి ఒకరికొకరు ఇచ్చుకునే గౌరవానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె కోరారు. అలాగే ఫ్యాన్స్ కూడా ఆటగాళ్లపై కాస్త దయ చూపిస్తూ మంచి సపోర్ట్ ఇవ్వాలని చెప్పింది.

ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండు జట్లూ అర్హత సాధించాయి. అందువల్ల ఈ సీజన్‌లో కోహ్లీ, హెడ్ జట్లు మళ్లీ తలపడే అవకాశం ఉండటంతో ఈ వివాదం మరింత ఉత్కంఠ రేపుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

