Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బ్రెట్ లీతో కరచాలనం: బౌలింగ్ చేసిన కెప్టెన్ కోహ్లీ

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ చేశాడు. కోహ్లీ బౌలింగ్ చేయడమేంటని అనుకుంటున్నారా? అవును. నిజమే. బెంగుళూరు వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఈ సన్నివేశం చోటు చేసుకుంది.

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య శనివారం బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో రెండో టెస్టు ప్రారంభమైన సంగతి తెలిసిందే. మూడో రోజైన సోమవారం ఉదయం టీమిండియా ఆటగాళ్లు ప్రాకీస్టు సెషన్‌లో పాల్గొన్నారు. ఈ ప్రాక్టీస్ సెషన్ లో విరాట్ కోహ్లీ బౌలింగ్ చేశాడు.

Virat Kohli Toys With Idea of Bowling on Third Morning

దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విటర్‌‌లో పోస్టు చేసింది. అంతక ముందు కోహ్లీ ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీతో కరచాలనం చేశాడు. ఇదిలా ఉంటే బెంగుళూరు టెస్టులో ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 276 పరుగులకు ఆలౌటైంది.

నాలుగు టెస్టుల సిరిస్‌లో పూణెలో జరిగిన తొలి టెస్టులో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో బెంగుళూరు టెస్టులో తొలి రెండు రోజులు ఆస్ట్రేలియా కంటే వెనకబడిన కోహ్లీసేన ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలనే ధీమాతో ఉంది.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+