నేనీ స్థాయిలో ఉన్నానంటే ఆయన చలవే..!!
ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ తనదైన శైలిలో దూసుకెళ్తోన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్ 2025 విజయాలను పునరావృతం చేయాలనే లక్ష్యంతో, ఆర్‌సీబీకి కోహ్లీ అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు. మార్చి 28న సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 38 బంతుల్లో అజేయంగా 69 పరుగులు చేసి ఆర్‌సీబీని 6 వికెట్లతో గెలిపించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో 18 బంతుల్లో 28 (2 ఫోర్లు, 1 సిక్స్) నమోదు చేయగా, రాజస్థాన్ రాయల్స్‌తో ఏప్రిల్ 10న 16 బంతుల్లో 32 పరుగులు చేశాడు.
ఢిల్లీ క్యాపిటల్స్‌పై 19, ఇంకొక మ్యాచ్‌లో 38 బంతుల్లో 50 పరుగులు సాధించాడు. గుజరాత్ టైటాన్స్‌పై 44 బంతుల్లో 81 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సాధించిన కోహ్లీ, ఐపీఎల్‌లో 800 ఫోర్లు కొట్టిన తొలి ఆటగాడయ్యాడు. లక్నో, ముంబైపై డక్‌లు ఎదుర్కొన్నా, కోల్‌కతాపై (60 బంతుల్లో 105*) అజేయ శతకంతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. 13 ఇన్నింగ్ లల్లో 542 పరుగులు చేశాడీ రన్ మెషీన్. బ్యాటింగ్ యావరేజ్ 54.20. ఇందులో అయిదు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉంది.

తాజాగా తన చిన్నప్పటి కోచ్ రాజ్ కుమార్ శర్మను కలిశాడు విరాట్ కోహ్లీ. ఆయన పాదాలను తాకి ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు. ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాడు. తన విజయానికి ఆయనే కీలక కారణమని కోహ్లీ స్పష్టం చేశారు. తాను ఈ స్థాయికి చేరుకోవడంలో రాజ్ కుమార్ శర్మ కష్టం ఎంతో ఉందని పేర్కొన్నాడు. దశాబ్దాలపాటు రాజ్ కుమార్ తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు విరాట్ కోహ్లీ.
"రాజ్‌కుమార్ శర్మ సార్ నన్ను ఎనిమిదేళ్ల వయస్సు నుండి చూస్తున్నారు, అప్పటి నుండి నేను ఆయన అకాడమీలో శిక్షణ పొందాను. ఆట గురించి నాకు తెలిసిన ప్రతిదీ, బ్యాటింగ్ టెక్నిక్స్ అన్నీ ఆయనే నేర్పించారు. ఈ రోజు నేను ఉన్న ఆటగాడిని కావడానికి ఆయన కారణం." అని చెప్పాడు. రెడ్ బాల్ క్రికెట్ పట్ల వారిద్దరూ తమ అపారమైన గౌరవాన్ని వ్యక్తం చేశారు. ఈ ఫార్మాట్‌కు ఉన్న ప్రాముఖ్యత గురించి వివరించారు.
ఈ సందర్భంగా రాజ్ కుమార్ శర్మ మాట్లాడుతూ విరాట్ కోహ్లీతో ఎల్లప్పుడూ రెడ్ బాల్ క్రికెట్ గురించే చెప్పేవాడినని, అదే నిజమైన క్రికెట్ అని వ్యాఖ్యానించారు. ఆయన అభిప్రాయంతో విరాట్ కోహ్లీ ఏకీభవించాడు. తమకు క్రికెట్ వారసత్వం అంటే రెడ్ బాల్ ఫార్మటేనని స్పష్టం చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications