Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India won Champions Trophy: విజయం తర్వాత 'ఆమె' కాళ్లు మొక్కిన విరాట్ కోహ్లీ (వీడియో వైరల్)

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత దూకుడుగా కనిపిస్తాడో అదే సమయంలో ఎంతో వినయంగానూ ఉంటాడు. పరిస్థితిని బట్టి, అవతలి వ్యక్తి బిహేవ్ బట్టి తన యాటిట్యూడ్ ను ప్రదర్శిస్తుంటాడు. తన తోటీ ఆటగాళ్లతో ఎంతో సరదాగా ఉంటాడు. వారి కుటుంబ సభ్యులను కలిసినప్పుడు కూడా ఎంతో ప్రేమగా పలకరిస్తుంటాడు. తాజాగా అతడు ఫైనల్ మ్యాచ్ విజయం తర్వాత ఒక ఆమె కాళ్లు పట్టుకుని మొక్కాడు. ఆమె పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇంతకీ ఆమె ఎవరంటే?

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. అతడి కోసం అభిమానులు ఎగబడుతూ ఉంటారు. అతడితో సెల్ఫీలు దిగేందుకు, ఆటోగ్రాఫ్‌లు తీసుకునేందుకు పోటీపడుతుంటారు. మరి కొందరైతే అతడి దగ్గరికి వెళ్లి మరీ కాళ్ల మీద పడిపోతుంటారు. అలాంటిది.. ఇప్పుడు కోహ్లీ ఇప్పుడు ఇంకొకరి కాళ్లు మొక్కడం ఏంటని అనుకుంటున్నారా..

Virat Kohli touches Mohammed Shami mothers feet after India won Champions Trophy 2025

ఫైనల్ మ్యాచ్ ముగిశాక భారత జట్టు అంతా విజయోత్సాహంలో ముగిగిపోయారు. అప్పుడే మైదానంలో సీనియర్ ఆటగాడు మహ్మద్ షమీ తల్లి మైదానంలోకి వచ్చారు. వెంటనే కోహ్లీ ఆమె దగ్గరికి వెళ్లి కాసేపు ముచ్చటించాడు. ఆమె కూడా కోహ్లీని ఎంతో ఆప్యాయంగా పలకరించింది. అప్పుడే విరాట్.. ఆమె పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఈ హార్ట్ టచింగ్ మూమెంట్ అక్కడి వాళ్ల మనసులను తాకింది. పెద్దవారికి కోహ్లీ ఇచ్చే గౌరవం చూసి ఫ్యాన్స్ మరోసారి అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

కాగా, ఈ ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 1 పరుగు చేసి ఔటయ్యాడు. బ్రేస్ వెల్ బౌలింగ్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో అతడి అభిమానులు కాస్త నిరుత్సాసపడ్డారు. కానీ ఫైనల్ విజయం తర్వాత సంబరాల్లో మునిగి తేలుతున్నారు.

Story first published: Monday, March 10, 2025, 8:35 [IST]
Other articles published on Mar 10, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+