Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: అక్షర్ పటేల్ పాదాలను తాకిన విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్

IND vs NZ: ఛాంపియన్స్ ట్రోఫీ చివరి లీగ్ మ్యాచ్ లో టీమిండియా న్యూజిలాండ్ ను 44 పరుగుల తేడాతో ఓడించింది ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 249 పరుగులు చేసింది. 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ కేవలం 205 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ లో టీమిండియా దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ అక్షర్ పటేల్ పాదాలను తాకేందుకు ప్రయత్నించాడు. విరాట్ కోహ్లీ ఇలా చేయడానికి ఓ కారణం ఉంది.

అక్షర్ పాదాలను విరాట్ ఎందుకు తాకాడంటే?
ఇప్పుడు అందరి మనస్సులో ఉన్న ప్రశ్న ఏమిటంటే.. విరాట్ ఇలా ఎందుకు చేశాడు? నిజానికి 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే సమయంలో న్యూజిలాండ్ జట్టు ఒకానొక సమయంలో మ్యాచ్ పై పట్టు సాధించింది. ముఖ్యంగా కేన్ విలియమ్సన్ క్రీజులో స్థిరంగా నిలబడి ఉన్నాడు. కేన్ విలియమ్సన్ 81 పరుగులు చేసి ఇంకా ఆడుతున్నాడు. కానీ అక్షర్ పటేల్ తన స్పెల్ చివరి బంతికి కేన్ విలియమ్సన్ ను ఔట్ చేసి పెవిలియన్ కు పంపాడు. అక్షర్ వేసిన బంతిని విలియమ్సన్ ముందుకు వచ్చి షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ విలియమ్సన్ బంతిని మిస్ అయ్యాడు. దీంతో వికెట్ల వెనుక ఉన్న కేఎల్ రాహుల్ స్టంపౌట్ చేశాడు.

Virat Kohli touched Axar Patel s feet Viral Video from IND vs NZ Match

విలియమ్సన్ వికెట్ పై విరాట్ కోహ్లీ ఎంతో ఉత్సాహంగా కనిపించాడు. విరాట్ సంతోషంతో పరిగెత్తి అక్షర్ పటేల్ పాదాలను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఇంతలో అక్షర్ కూడా నవ్వుతూ కోహ్లీని ఆపుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Take a Poll

న్యూజిలాండ్ ను ఓడించిన టీమిండియా
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తమ అద్భుతమై ప్రదర్శనను కొనసాగిస్తోంది. లీగ్ మ్యాచ్ లలో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. మొదట టీమిండియా బంగ్లాదేశ్ ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. అనంతరం పాకిస్థాన్ పై కూడా 6 వికెట్ల తేడాతో గెలిచింది. తాజాగా న్యూజిలాండ్ ను 44 పరుగుల తేడా ఓడించి ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీ ఫైనల్ కు చేరుకుంది. టీమిండియా మార్చి 4న ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ ఆడాల్సి ఉంది.

Story first published: Monday, March 3, 2025, 8:43 [IST]
Other articles published on Mar 3, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+