
కోహ్లీ@1:
రోజురోజుకు విరాట్ కోహ్లీ ఆటతో పాటే బ్రాండ్ వాల్యూ కూడా విపరీతంగా పెరుగుతోంది. 'ద డఫ్ అండ్ ఫెల్ప్స్' అనే సంస్థ జరిపిన సర్వే ప్రకారం.. రూ.1690 కోట్ల బ్రాండ్ విలువతో కోహ్లీ భారత్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. 2019లో విరాట్ బ్రాండ్ వాల్యూ 39 శాతం పెరిగి రూ. 1690 కోట్లకు చేరింది. 2018 నుంచి 2019కి బ్రాండ్ విలువ 39 శాతం పెరిగిందంటే అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

అక్షయ్ కుమార్ హవా:
వరుస సినిమాలతో దూసుకెళుతున్న బాలీవుడ్ 'యాక్షన్ హీరో' అక్షయ్ కుమార్ రూ.743 కోట్లతో బ్రాండ్ వాల్యూలో రెండో స్థానంలో ఉన్నాడు. అక్షయ్ చేస్తున్న సినిమాలు యువతతో పాటు సమాజానికి కూడా మెసేజ్ ఇచ్చేలా ఉండటం అతని బ్రాండ్ వాల్యూని పెంచుతున్నాయి. గతేడాది దీపికా పదుకొణె రెండవ స్థానంలో ఉండగా.. ఈసారి మూడవ స్థానంకు పడిపోయింది. ఆమె బ్రాండ్ వాల్యూ రూ.665 కోట్లు.

ధోనీ@9:
అత్యధిక బ్రాండ్ విలువ గల భారత సెలబ్రిటీల లిస్టులో టాప్-20లో నలుగురు క్రికెటర్లు ఉన్నారు. రూ.293 కోట్లతో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 9వ స్థానంలో ఉన్నాడు. 2018లో 12వ స్థానంలో ఉన్న ధోనీ.. మూడు స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. క్రికెట్‌కి అందించిన సేవలతో పాటు సైన్యంలో చేరి విధులు నిర్వహించడమే ధోనీ బ్రాండ్ వాల్యూ పెరిగిందని విశ్లేషకులు అంటున్నారు.

20వ స్థానంలో రోహిత్:
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రూ.153 కోట్లతో 15వ స్థానంలో నిలిచాడు. ఓపెనర్ రోహిత్ శర్మ (రూ.163 కోట్లు) 20వ స్థానంలో ఉన్నాడు. బ్రాండ్ వాల్యూలో కోహ్లీ కంటే రోహిత్ పది రెట్లు తక్కువ. ఒకప్పుడు సినిమా సెలబ్రిటీలకు ఎక్కువ బ్రాండ్ వాల్యూ ఉండేది. సచిన్, ధోనీ, కోహ్లీ లాంటి వాళ్లు వచ్చాక క్రికెట్ వైపు తిరిగింది. టాప్ 20 సెలబ్రిటీల మొత్తం బ్రాండ్ వాల్యూ రూ.7833 కోట్లు.


Click it and Unblock the Notifications












