For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విరాట్ కోహ్లీ వరల్డ్‌కప్ స్పైక్స్‌ను చూశారా? (వీడియో)

Virat Kohli to Sport Limited Edition Gold & White Shoes at World Cup

హైదరాబాద్: ఇంగ్లాండ్‌లో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గోల్డెన్ కలర్‌ను కలిగి ఉన్న తెల్లటి లిమిటెడ్ ఎడిషన్ పూమా షూస్‌ను ధరించనున్నాడు. వరల్డ్‌కప్‌లో తాను గోల్డ్ కలర్ స్పైక్స్ వేసుకోనున్నట్లు విరాట్ కోహ్లీ తన ట్విట్టర్‌లో ప్రకటించాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

పూమా కంపెనీ మొత్తం 150 షూస్‌ను తయారు చేయగా అందులో మొట్టమొదటి పెయిర్‌ను కోహ్లీ అందుకున్నాడు. మే నెలాఖరున మిగతావాటిని లండన్‌లో నిర్వహించే వేలంలో అమ్మనున్నారు. పూమా గోల్డ్ కలర్ మొదటి స్పైక్స్‌‌ను అందుకున్న సందర్భంగా ట్విట్టర్‌లో స్పందించాడు.

సంతోషంగా ఉంది

"ఈ స్పెషల్ ట్రీట్‌మెంట్‌కు చాలా సంతోషంగా ఉంది. ఇది మాకొక చాలా అతి ముఖ్యమైం టోర్నమెంట్. ఈ గోల్డెన్ షూస్ వేసుకునేందుకు ఎంతో ఆతృతగా ఉన్నా. గోల్డ్ కలర్‌తో కూడిన వైట్ షూస్ అంటే నాకెంతో ఇష్టం. నా స్టయిల్‌కు ఇవెంతో ఫిట్ అవుతాయి" అని విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు.

ఇంగ్లాండ్‌కు బయల్దేరిన టీమిండియా

ఇంగ్లాండ్‌కు బయల్దేరిన టీమిండియా

కాగా, వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకు టీమిండియా మంగళవారం ముంబై ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇంగ్లాండ్‌‌కు బయల్దేరి వెళ్లింది. 15 మంది సభ్యులతో కూడిన బృందంతో పాటు హెడ్ కోచ్‌ రవిశాస్త్రి, జట్టు సపోర్టింగ్ స్టాఫ్ ఇంగ్లాండ్‌ బయల్దేరి వెళ్లింది. ఈ సందర్భంగా ఆటగాళ్లందరూ బ్లేజర్స్ ధరించారు.

పబ్‌జీ గేమ్‌ ఆడిన క్రికెటర్లు

పబ్‌జీ గేమ్‌ ఆడిన క్రికెటర్లు

విమానం ఎక్కడానికి ముందు కొంత సమయం ఉండటంతో జట్టులోని పలువురు ఆట‌గాళ్లు స‌ర‌దాగా పబ్‌జీ గేమ్‌ను ఆడారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ తన ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ఆరంభం కానుంది. టోర్నీకి ముందు టీమిండియా మే 25న న్యూజిలాండ్‌తో, మే 28న బంగ్లాదేశ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనుంది.

ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఐదోసారి

ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఐదోసారి

ఇక, మెగా టోర్నీలో భాగంగా విరాట్‌ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా జూన్‌ 5న సౌతంప్టన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో తన తొలి మ్యాచ్‌ ఆడనుంది. వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి. ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. డే మ్యాచ్‌లు అన్ని కూడా భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నాం 2.30 గంటలకు ప్రారంభమవుతాయి.

లార్డ్స్‌లో వరల్డ్‌కప్ పైనల్ మ్యాచ్

లార్డ్స్‌లో వరల్డ్‌కప్ పైనల్ మ్యాచ్

డే/నైట్ మ్యాచ్‌లు మాత్రం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ వరల్డ్‌కప్‌ను మాత్రం రౌండ్ రాబిన్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. జులై 14న జరిగే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కి ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది.

Story first published: Wednesday, May 22, 2019, 14:35 [IST]
Other articles published on May 22, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+