Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డ్రెస్సింగ్ రూమ్ టెన్షన్స్: కెప్టెన్‌ హోదాలో కోహ్లీ హాజరవుతాడా?

Kohli To Miss Pre Departure Press Conference Amid Reports Of Dressing Room Tensions || Oneindia
Virat Kohli to miss pre-departure press conference amid reports of dressing room tensions

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య విభేధాలున్నట్లు ఉన్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే, ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అదంతా మీడియా సృష్టేనని బీసీసీఐ పాలకుల కమిటీ ఛైర్మన్ వినోద్‌ రాయ్‌ కూడా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి

అయితే, రోహిత్ శర్మతో వివాదం వార్తల నేపథ్యంలో మీడియా సమావేశానికి దూరంగా ఉండాలని కోహ్లీ భావిస్తున్నాడట. ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమిండియా సోమవారం వెస్టిండిస్ పర్యటనకు బయల్దేరనుంది. ఈ పర్యటనకు ముందు టీమిండియా హెడ్ కోచ్‌తో కలిసి కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియా సమావేశానికి హాజరు కావాల్సి ఉంది.

అయితే, ఈ సమావేశానికి కెప్టెన్‌ హోదాలో విరాట్ కోహ్లీ హాజరవుతాడా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశంలో మీడియా నుంచి ఎదురయ్యే ప్రశ్నలను ఎదుర్కొవడం ఇష్టం లేని విరాట్ కోహ్లీ ఈ సమావేశానికి డుమ్మా కొట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏదైనా విదేశీ పర్యటనకు వెళ్లే ముందు మీడియా సమావేశం నిర్వహించడం సర్వ సాధారణం.

ఈ సమావేశంలో కెప్టెన్‌ హోదాలో ఉన్న వ్యక్తే పర్యటనకు సంబంధించి వివరాలను వెల్లడిస్తాడు. ప్రపంచకప్ ఓటమితో పాటు రోహిత్ శర్మతో విభేధాల నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఈ సమావేశానికి హాజరవుతాడా లేదా అనేది తెలియాలంటే ఒక రోజు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే, విండిస్ పర్యటనలో భాగంగా టీమిండియా 3 వన్డేలు, 3 టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది.

Story first published: Sunday, July 28, 2019, 14:29 [IST]
Other articles published on Jul 28, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+