మొహాలీలో రెండో టీ20: అతడికి కెప్టెన్ కోహ్లీ చేతుల మీదుగా ఘన సన్మానం

హైదరాబాద్: గత 22 సంవత్సరాలుగా భారత క్రికెట్‌కు అందించిన సేవలకు గాను మొహాలీలోని పీసీఏ స్టేడియం ఛీఫ్ క్యూరేటర్ దల్జిత్ సింగ్‌ను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గౌరవించనున్నాడు. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా బుధవారం మొహాలీ వేదికగా రాత్రి 7 గంటలకు రెండో టీ20 ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా బోర్డు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ "బీసీసీఐ పిచ్ కమిటీ నుంచి దల్జిత్ సింగ్ ఈరోజు రిటైరవుతున్నాడు. మొహాలీ గేమ్ అతడికి చివరది. భారత క్రికెట్‌కు అతడు అందించిన సేవలకు గాను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేతుల మీదగా అతడిని గౌరవించాలని బోర్డు నిర్ణయించింది" అని అన్నాడు.

2012 నుంచి బీసీసీఐ పిచ్ కమిటీలో
దల్జిత్ సింగ్ 2012 నుంచి బీసీసీఐ పిచ్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. స్పోర్టింగ్ పిచ్‌లు రూపొందించడం కంటే హోమ్ జట్టుకు తగినట్లుగా పిచ్‌లు తయారు చేయడంలో దల్జిజ్ సింగ్ సిద్ధహస్తుడు. దల్జిత్ సింగ్ ఛీఫ్ క్యూరేటర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పలువురు యువకులు సైతం పిచ్‌లను తయారు చేసే ఆర్ట్‌ను నేర్చుకునేందుకు ఆసక్తిని చూపించారు.

క్యూరేటర్లకు కోర్సులు
"2012లో బీసీసీఐ పిచ్ కమిటీకి ఛైర్మన్ అయినప్పుడు ఆయన ధృవీకరణ కోర్సులు ప్రారంభించాడు. ఇందుకోసం 21 రోజుల వర్క్‌షాప్ కూడా నిర్వహించాడు. దీంతో భారత క్రికెట్‌లో తొలిసారి క్యూరేటర్లకు ఓ మ్యాన్యువల్ కూడా రూపొందించాడు. మ్యాచ్ అధికారుల మాదిరే క్యూరేటర్లకు గౌరవం ఇవ్వాలని కోరేవాడు" అని మరో క్యూరేటర్ వెల్లడించాడు.

టీమిండియాకు షాకిచ్చిన వరుణుడు
హోమ్ సీజన్‌ను ఘనంగా ఆరంభిద్దామనుకున్న టీమిండియాకు వరుణుడు షాకిచ్చాడు. మూడు టీ20ల సిరిస్‌లో తొలి టీ20 మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కావడంతో భారత్, దక్షిణాఫ్రికా పోరు రెండు మ్యాచ్‌ల సిరీస్‌కే పరిమితమైంది. ఈ సిరిస్‌లో ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. దీంతో రెండో టీ20లో ఇరు జట్ల గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications