'టిమ్ పైన్-విరాట్ కోహ్లీ మాటల యుద్ధం హాస్యభరితంగా కనిపించింది'


హైదరాబాద్: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్‌ల మధ్య పెర్త్ టెస్టులో చోటు చేసుకున్న మాటల యుద్ధం హాస్యభరితంగా కనిపించిందని ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ అన్నాడు. అంతేకాదు పెర్త్ టెస్టులో వీరిద్దరూ హద్దులు మీరలేదని కూడా పేర్కొన్నాడు. ఆటలో భాగంగా నాలుగో రోజు ఒకానొక దశలో టిమ్ పైన్ పరుగు తీస్తున్నప్పుడు విరాట్ కోహ్లీ అతడిని సమీపించిన సంగతి తెలిసిందే.

ఇద్దరి మధ్య మాటల యుద్ధాన్ని ఆస్వాదించా
అయితే, ఇద్దరి మధ్య మాటల యుద్ధాన్ని తాను ఆస్వాదించానని జస్టిన్ లాంగర్ వెల్లడించాడు. తాజాగా పీటీఐ, ఫాక్స్ క్రికెట్‌కు ఇచ్చిన ఇంటర్యూలో జస్టిన్ లాంగర్ మాట్లాడుతూ "ఇది చాలా తెలివైన ఘర్షణ. ఇద్దరు కెప్టెన్లు ఆటపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నించారు. వారి మధ్య కించపరిచే మాటలు లేవు. నిజానికి ఈ మాటల యుద్ధం హాస్యభరితంగా ఉంది" అని అన్నాడు.

ఆస్ట్రేలియా శైలి హాస్యం కనిపించింది
"టెస్టు మ్యాచ్‌లో ఇది అవసరం. మాటల యుద్ధంలో ఆస్ట్రేలియా శైలి హాస్యం కనిపించింది. ఇలాంటి వ్యవహారాల్లో మాకు చెడ్డ పేరుంది. ఎప్పుడైతే హాస్యం తోడవుతుందో అప్పుడది మంచి ఘర్షణగా మారుతుంది. టీమిండియాతో ఆసీస్ పోటాపోటీగా ఆడినందుకు సంతోషంగా ఉంది" అని లాంగర్ చెప్పుకొచ్చాడు.

మూడో రోజు భారత్ చాలా దూకుడుగా
"మూడో రోజు భారత్ చాలా దూకుడుగా కనిపించింది. టెస్టు క్రికెట్ అంటేనే అది. మేం నైపుణ్యంతో నిలవాలనుకున్నాం. టిమ్ పైన్, విరాట్ కోహ్లీ ఇద్దరూ సమీపించారు. అలా జరగకూడదు, కానీ టెస్టు క్రికెట్‌లో ఇవన్నీ ఓ భాగం మాత్రమే. రిషభ్ పంత్ ఔటైన తర్వాతే కాస్త ఉపశమనంగా అనిపించింది. అతడు చాలా ప్రమాదకారి. షమి బౌలింగ్ చూసి రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తే బాగుండనిపించింది" అని లాంగర్ అన్నాడు.

నాథన్ లియాన్ తన బౌలింగ్‌తో అద్భుతం చేశాడు
"ఈ మ్యాచ్‌లో నాథన్ లియాన్ తన బౌలింగ్‌తో అద్భుతం చేశాడు. టిమ్ పైన్ కెప్టెన్సీ బాగుంది. అతడు నిరంతరం నేర్చుకుంటూనే ఉన్నాడు. మంచి ఆటగాడు మాత్రమే కాదు మంచి వ్యక్తి కూడా. ఆసీస్ ఆటగాళ్లు ఇంకా మెరుగు పరుచుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి" అని జస్టిన్ లాంగర్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications