Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతను భారత జట్టులో ఉన్న ఆస్ట్రేలియన్: స్టీవ్ స్మిత్

టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లిపై ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ ప్రశంసల జల్లు కురిపించాడు. కోహ్లి ఓ అద్భుతమైన బ్యాటర్ అని, గొప్ప వ్యక్తి అని కొనియాడాడు. ఈ క్రమంలో రన్ మెషిన్ కోహ్లి గురించి స్మిత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మాటల్లో, చేతల్లో కోహ్లి ఆస్ట్రేలియన్ అని అన్నాడు. అతని యాక్షన్ ఓ ఆస్ట్రేలియన్‌ను తలపిస్తాయని స్మిత్ చెప్పాడు.

''ఆలోచనలు, యాక్షన్‌లో విరాట్ కోహ్లి ఓ ఆస్ట్రేలియన్. అతను బరిలోకి దిగే విధానం, సవాళ్లను స్వీకరించే తీరు, ప్రత్యర్థిపై పైచేయి సాధించడానికి చేసే పోరాటం.. ఆస్ట్రేలియన్‌లా ఉంటుంది. భారత ప్లేయర్లలో అతను ఆస్ట్రేలియన్. అతని కంటే మెరుగైన ప్రదర్శన చేయాలని, అతన్ని అధిగమించాలనే ఆలోచన నాకు ఉండదు''

Virat Kohli Thinks and Acts Like an Australian Steve Smith Praises His Competitive Spirit

''మైదానంలోకి వెళ్లి సాధ్యమైనంత ఎక్కువ పరుగులు చేయాలని మాత్రమే ఆలోచిస్తాను. ఆస్ట్రేలియా విజయంలో నావంతు పాత్ర పోషించాలని ప్రయత్నిస్తాను. ఇక నేను కోహ్లి మంచి సన్నిహితులం. అతనో గొప్ప వ్యక్తి, అద్భుతమైన ప్లేయర్. ఈ సమ్మర్‌లో అతనితో పోటీ కోసం ఎదురు చూస్తున్నాను'' అని స్టీవ్ స్మిత్ అన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నవంబర్ 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది.

కంగారూల గడ్డపై గత రెండు బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లను కైవసం చేసుకున్న భారత్ ఈ సారి కూడా ఫేవరేట్‌గానే బరిలోకి దిగుతోంది. 2016 నుంచి టీమిండియానే ఈ ట్రోఫీని వరుసగా గెలుస్తున్న విషయం తెలిసిందే. 2016/17, 2022/23లో భారత్, 2018/19, 2020/21లో ఆస్ట్రేలియా ఈ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చింది.

పెర్త్ వేదికగా తొలి టెస్టు నవంబర్ 22-26 వరకు జరగనుంది. అలాగే అడిలైడ్ వేదికగా పింక్ బాల్ టెస్టు డిసెంబర్ 6-10 వరకు, బ్రిస్బేన్ వేదికగా డిసెంబర్ 14-18 వరకు మూడో టెస్టు, డిసెంబర్ 26-30 వరకు బాక్సింగ్ డే టెస్టు, సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి 7 వరకు ఆఖరి టెస్టు జరగనుంది.

Story first published: Tuesday, September 10, 2024, 15:56 [IST]
Other articles published on Sep 10, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+