Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సరైన ప్రత్యర్ధి లేనప్పుడు వాటివల్ల ప్రయోజనమేంటి?: విరాట్ కోహ్లీ

Virat Kohli: Theres no utility of tour games if you are not provided quality opposition

హైదరాబాద్: బలమైన ప్రత్యర్థి, సరైన పరిస్థితులు లేకుండా విదేశీ పర్యటనల్లో సన్నాహక మ్యాచ్‌లు ఆడడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఈ ఏడాది సఫారీ గడ్డపై, ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను చేజార్చుకోవడంతో కోహ్లీసేనపై తీవ్ర విమర్శలు వస్తోన్న సంగతి తెలిసందే.

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను మరో టెస్టు మిగలుండగానే 1-3తో చేజార్చుకోవడంతో.... ఇంగ్లాండ్ పర్యటన ఆరంభంలో టీమిండియా తగినన్ని ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడక పోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ విమర్శించిన సంగతి తెలసిందే. దీనిపై కోహ్లీ తాజాగా స్పందించాడు.

1
42378
 మేం తలపడిన ప్రత్యర్థులు ఎవరు?

మేం తలపడిన ప్రత్యర్థులు ఎవరు?

"చాలా మంది సన్నాహక మ్యాచ్‌ల గురించి మాట్లాడుతున్నారు. కానీ మేం తలపడిన ప్రత్యర్థులు ఎవరు.. వారి బౌలింగ్‌లో నాణ్యత ఎంత.. ఇలాంటి విషయాల గురించి కూడా వారు మాట్లాడాలి. టెస్టు సిరీస్‌కు ముందు తగిన సన్నద్ధత లేకపోతే అది సరిగా ఉపయోగించుకోలేకపోవడం అవుతుంది. కానీ టెస్టుల ముందు దీటైన ప్రత్యర్థితో ఆడకపోతే అది సమయాన్ని వృథా చేసినట్టే" అని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.

 వ్యక్తిత్వాన్ని గుర్తు పెట్టుకుంటారు

వ్యక్తిత్వాన్ని గుర్తు పెట్టుకుంటారు

ఇక, మైదానం బయట ఒత్తిళ్లను ఎలా ఎదుర్కొంటున్నారు అన్న ప్రశ్నకు గాను "ప్రజలు మనం చేసిన పరుగులను కాదు.. వ్యక్తిత్వాన్ని గుర్తు పెట్టుకుంటారు. ఎవరైనా విండీస్‌ దిగ్గజం రిచర్డ్స్‌ గురించి మాట్లాడితే.. అతడి సగటు గురించి ప్రస్తావించరు. అతని వ్యక్తిత్వం గురించే చర్చిస్తారు. అందరిలో అతడే ఎలా స్ఫూర్తి నింపాడో మాట్లాడుకుంటారు. నేనూ అలా ఉండాలంటే నా అడుగులు కూడా సరైన దిశలో పడాలి" అని కోహ్లీ అన్నాడు.

ఓడిన తీరే ఎక్కువ బాధ కలిగిస్తోంది

ఓడిన తీరే ఎక్కువ బాధ కలిగిస్తోంది

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఓటమి కంటే ఓడిన తీరే ఎక్కువ బాధ కలిగిస్తోందని కోహ్లీ అన్నాడు. ఈ సిరిస్‌లో గెలవాల్సిన మ్యాచ్‌లను చేజార్చుకున్నామని కోహ్లీ చెప్పాడు. "ఇది కఠినమైన సిరీస్‌ అన్న విషయం మాకు అర్థమైంది. కొన్ని తప్పులు చేశాం. వాటిని ఒప్పుకున్నాం. సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాం. జట్టులో ప్రతిభకైతే లోటు లేదు. అయితే ప్రతిభ కొంతవరకే పనికొస్తుంది" అని కోహ్లీ అన్నాడు.

 మానసికంగా బలంగా ఉండాలి

మానసికంగా బలంగా ఉండాలి

"విదేశీ పర్యటనల్లో మానసికంగా బలంగా ఉండాలి. ప్రతికూల పరిస్థితుత్లో టెస్టు సిరీస్‌ల్లో విజయం సాధించాలంటే ఈ బలం మేం సాధించాలి. విజయం సాధించే పరిస్థితులు ఉన్నప్పుడు ఏమీ చేయలేకపోతే.. చాలా బాధ కలుగుతుంది. అసహనంగా కూడా ఉంటుంది. ఎందుకంటే విజయం సాధించే పరిస్థితులను సృష్టించుకున్నా.. ఆధిపత్యం చెలాయించలేకపోయాం. అందుకే ఓటమి కంటే ఓడిన తీరే బాధిస్తోంది" అని కోహ్లీ అన్నాడు.

Story first published: Sunday, September 9, 2018, 10:29 [IST]
Other articles published on Sep 9, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+