Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ పిచ్‌పై డబుల్: ఆండర్సన్‌పై సన్నీ ఫైర్, కోహ్లికి మద్దతు

హైదరాబాద్: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటలో మార్పు వచ్చిందని తాను అనుకోవట్లేదని ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. ఆండర్సన్ చేసిన వ్యాఖ్యలు అతని అసహనానికి అద్దం పడుతుందని గవాస్కర్ వ్యాఖ్యానించాడు.

సోమవారం ఓ జాతీయ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్యూలో గవాస్కర్ మాట్లాడాడు. ఆండర్సన్ చేసిన వ్యాఖ్యలు అతడి వ్యక్తిత్వాన్ని సూచిస్తాన్నయే తప్పా, దీనివల్ల కోహ్లీకి ఒరిగే నష్టమేమీ లేదని గవాస్కర్ తెలిపాడు. కోహ్లి తన టెక్నిక్‌ను మార్చుకోలేకపోవచ్చు, కానీ తన స్వభావంలో మాత్రం చాలా బలంగా ఉన్నాడని గవాస్కర్ అన్నాడు.

'పిల్లలు, పెద్దవారికి స్వభావంలో చాలా తేడా ఉంటుంది. టెక్నిక్ మాత్రం మారలేదు. అయితే స్వభావం విషయంలో మాత్రం విరాట్ కోహ్లీ చాలా ఎత్తులో ఉన్నాడు' అని గవాస్కర్ పేర్కొన్నాడు. పిల్లల నుంచి పెద్దవారిగా మార్చేది ఏదైనా ఉందంటే అది స్వభావమేనని అన్నాడు.

ఒక జట్టు ఓటమి పాలైనప్పుడు దాన్ని అంగీకరించే స్వభావం కూడా ఇక్కడ ముఖ్యమని అండర్సన్‌ను ఉద్దేశించి గవాస్కర్ సూచించాడు. ఇటీవల కాలంలో బ్యాటింగ్‌లో ఎంతో పరిణితి చెందిన కోహ్లీపై గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. వాంఖడె స్టేడియంలో ఇంతకమునుపెన్నడూ కోహ్లీ తరహా ప్రదర్శన తాను చూడలేదని పేర్కొన్నాడు.

Virat Kohli, There Has Never Been Another Like Him: Sunil Gavaskar

ఒక టర్నింగ్ ట్రాక్‌పై కోహ్లీ డబుల్ సెంచరీ నమోదు చేయడమంటే అది అంత ఈజీ విషయం కాదని చెప్పుకొచ్చాడు. ముంబై ఈ పిచ్‌లో సెంచరీ వరకూ ఒక మంచి ఆటగాడ్ని నుంచి ఆశించవచ్చు.. కానీ అంతకుమించి ఆడటమంటే ఎంతో ప్రతిభ కావాలంటూ కోహ్లీపై సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు.

ప్రస్తుతం జనరేషన్‌లో అత్యంత విలువైన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది కోహ్లీ మాత్రమేనని తెలిపాడు. ఇక ఆండర్స్ వ్యాఖ్యలను ఆకాశ్ చోప్రా సైతం ఖండించాడు. ఓటమిని ఏ జట్టు ఆటగాడైనా అంగీకరించాలని సూచించాడు. భారత్ విజయాన్ని ఓర్వలేని ఆ జట్టు ప్రధాన పేసర్ జేమ్స్ ఆండర్సన్ తన అసంతృప్తిని వెళ్లగక్కాడు.

భారత్ విజయానికి కారణం ఇక్కడి స్లో పిచ్‌లే అంటూ ధ్వజమెత్తాడు. పేస్‌కు అనుకూలించిన పిచ్‌లను తయారు చేసినందువల్లే ఇంగ్లాండ్ ఘోరంగా ఓటమి పాలైనట్లు ఆండర్సన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతకాదు భారత్ పిచ్‌లను రూపొందించే క్రమంలో పాటించాల్సిన సాంకేతిక పద్ధతులను పాటించలేదని ఆండర్సన్ విమర్శించాడు.

ఇదంతా కూడా విరాట్ కోహ్లే చెప్పడం వల్లే జరిగిందంటూ వ్యాఖ్యానించాడు. 2014లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన కోహ్లీ అప్పట్లో బ్యాటింగ్ చేయడంలో చాలా ఇబ్బంది పడిన సందర్భాన్ని కూడా గుర్తు చేశాడు. 'కోహ్లి ఆటలో మార్పు వచ్చిందని అనుకోవట్లేదు. అతడి బ్యాటింగ్‌లో లోపాలు ఇక్కడి పిచ్‌లపై కనిపించడం లేదంతే. పిచ్‌ల్లో వేగం, స్వింగ్‌ లేకపోవడం వల్లే ఇంగ్లాండ్‌లో మాదిరిగా అతడిని ఔట్‌ చేయలేపోయాం' అని పేర్కొన్నాడు.

'కాకపోతే స్పిన్‌ను బాగా ఆడగలిగే కోహ్లి, అదే చేశాడని భావిస్తున్నా. మా సిరీస్ ఓటమికి పూర్తిగా స్పిన్ అనుకూలించే పిచ్‌లే కారణం. ఇంగ్లాండ్‌లో అప్పడు కోహ్లీని ఏ రకంగా పేస్ బౌలింగ్‌తో ఇబ్బంది పెట్టేమో, అది ఇక్కడ పిచ్‌ల్లో కనిపించలేదు. ఇరు జట్ల మధ్యకు తేడా అదే. ఈ రకంగా చూస్తే కోహ్లి సాంకేతికంగా పరిణితి చెందాడని అనుకోవడం లేదు' అని విమర్శించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+