'స్వీట్ స్పాట్': సచిన్ ట్వీట్‌కు కెప్టెన్ కోహ్లీ రిప్లై ఇదీ
హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టుతో డబుల్ సెంచరీ చేయడంతో వరుసగా నాలుగు సిరీస్‌ల్లో నాలుగు డబుల్ సెంచరీలు చేసి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.
అయితే కోహ్లీ బంగ్లాపై డబుల్ సెంచరీ సాధించిన తర్వాత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ చేసిన ట్వీట్‌పై కెప్టెన్ కోహ్లీ స్పందించాడు. ఈ సందర్భంగా 'ధన్యవాదాలు సచిన్. మీరు తెలిపిన అభినందనలు నాకు ప్రపంచంతో సమానం' అని కోహ్లీ ట్వీట్టర్‌లో ట్వీట్ చేశాడు.
ఇదిలా ఉంటే హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన కోహ్లీపై క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించాడు. డబుల్ సెంచరీ సాధించిన అనంతరం కెప్టెన్ కోహ్లీ తన బ్యాట్‌తో ప్రేక్షకులకు అభివాదం చేశాడు.
ఈ సందర్భంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్... కోహ్లీ బ్యాట్‌పై ఓ స్పాట్‌ని పరిశీలనగా గమనించాడు. ట్విట్టర్‌లో 'నువ్వు అద్భతమని నీ బ్యాట్‌పై ఉన్న స్వీట్ బ్యాట్ చెబుతోంది. స్కోరు బోర్డ్స్ అవసరం లేదు. దేవుడు ఎల్లప్పుడూ నీ బ్యాట్ మాట్లాడేలా చేయాలి' అని సచిన్ ట్వీట్ చేశాడు.

బంగ్లాదేశ్‌పై 208 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించిన తర్వాత కొద్ది రోజులకు కోహ్లీ థ్యాంక్స్ చెప్పాడు. ఎప్పుడూ తనకు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఆదర్శమని చెప్పే కోహ్లి తన సచిన్ చేసిన ట్వీట్‌పై కొంచెం ఆలస్యంగానే స్పందించడం విశేషం.
ఇదిలా ఉంటే టెస్టుల్లో కోహ్లీ వరుసగా నాలుగో డబుల్ సెంచరీని సాధించాడు. తద్వారా టెస్టు క్రికెట్ చరిత్రలో వరుసగా నాలుగు సిరీస్‌లలో నాలుగు డబుల్ సెంచరీలు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అంతక ముందు వెస్టిండిస్‌పై 200, న్యూజిలాండ్‌పై 211, ఇంగ్లాండ్‌పై 235 ఇలా వరుసగా మూడు డబుల్ సెంచరీలు చేశాడు.
ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజాలు డాన్ బ్రాడ్‌మన్, రాహుల్ ద్రవిడ్‌ల రికార్డుని విరాట్ కోహ్లీ చెరిపేశాడు. డాన్ బ్రాడ్‌మన్, రాహుల్ ద్రవిడ్‌లు మాత్రమే వరుసగా మూడు సిరిస్‌లలో మూడు డబుల్ సెంచరీలను సాధించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications