
హైదరాబాద్: ఐసీసీ గదను అందుకున్న ఆనందంలో విరాట్ కోహ్లీ అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశాడు. సఫారీ పర్యటన ముగించుకున్న భారత్ సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌ను గెలిచింది. దీంతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానానికి చేరుకుంది.
సఫారీ జట్టుపై టీ20లో ఆఖరిదైన ఐదో టీ20ను సైతం భారత్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ అనంతరం ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న సునీల్ గావస్కర్, గ్రేమ్ పొలాక్ ..ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ గదను విరాట్ కోహ్లీకి బహుకరించారు. భారత క్రికెట్ టీమ్‌కు రూ.6.5కోట్ల ప్రైజ్ మనీని కూడా ఐసీసీ అందించింది.
టెస్టు ర్యాంకింగ్‌లు మార్చి 3వరకు ఎవరు టాప్‌లో ఉంటే వారికే ఇవ్వాల్సిన నేపథ్యంలో 3వ తేదీ వరకు మ్యాచ్‌లు లేకపోవడంతో ఐసీసీ భారత్‌కు చెందాలని నిర్ణయించింది. దీనికి స్పందించిన విరాట్ కోహ్లీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.
ఈ సందర్భంగా కెప్టెన్ మాట్లాడుతూ.. వరుసగా రెండోసారి ఐసీసీ టెస్టు గదను అందుకోవడం భారత జట్టులోని ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బందికి ప్రత్యేకమైన అనుభూతి. ఈ ఘనత సాధించడానికి భారత క్రికెట్ జట్టుకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు చెబుతున్నాను. మేము ఎక్కడ ఆడినా కఠిన సమయాల్లో మాకు ప్రేరణగా నిలిచారు. అని వీడియోలో సందేశంలో విరాట్ పేర్కొన్నాడు. ఈ వీడియోను ఐసీసీ తన అధికారిక అకౌంట్‌లో పోస్ట్ చేసింది.