For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ రిటైర్మెంట్.. బీసీసీఐ వైఖరి వల్లే..?

Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్టుల నుంచి అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడనే దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా విరాట్ కోహ్లీకి మళ్లీ టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాలని బీసీసీఐ సూచించిందని.. కానీ తర్వాత తన స్వరం మార్చుకుందని ఓ నివేదిక పేర్కొంది.

విరాట్ కోహ్లీ మే 12న ఇన్‌స్టా పోస్ట్‌లో టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన 5 రోజుల తర్వాత కోహ్లీ టెస్ట్ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం. ఇంగ్లాండ్ పర్యటనకు ముందే కోహ్లీ తన టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే కొన్ని రోజుల్లో ఇంగ్లాండ్ పర్యటనకు టీమిండియాను ఎంపిక చేయడానికి జాతీయ సెలెక్టర్ల సమావేశం జరగాల్సి ఉంది. జూన్‌లో ఇంగ్లాండ్‌తో భారత్ 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడాల్సి ఉంది.

Virat Kohli Test Retirement Did BCCI s Stand Force the Decision

డిసెంబర్-జనవరిలో జరిగిన ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా విరాట్ కోహ్లీ మళ్లీ టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాలని బీసీసీఐ సూచించిందని స్పోర్ట్స్ టాక్ నివేదిక పేర్కొంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆ సిరీస్ ‌ల టీమిండియా ఓటమిపాలైంది. సిరీస్‌లో భారత్ ఓటమి పాలైన తర్వాత జట్టు యాజమాన్యం వైఖరి మారిందని నివేదిక పేర్కొంది. అప్పుడు బీసీసీఐ ఓ యువకుడిని కెప్టెన్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కూడా విరాట్ కోహ్లీ కెప్టెన్సీని ఆశిస్తున్నాడని, ఫిబ్రవరిలో ఢిల్లీ తరఫున రంజీ ట్రోఫీ మ్యాచ్ కూడా ఆడాడని ఆ నివేదికలో ప్రస్తావించబడింది. కానీ ఏప్రిల్‌లో విరాట్ కోహ్లీని ఆటగాడిగా మాత్రమే పరిగణిస్తామని బీసీసీఐ చెప్పినట్లు తెలుస్తోంది.

దీని తర్వాత విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలో విరాట్ కోహ్లీని ఆటగాడిగా ఆడమని ఒప్పించడానికి బీసీసీఐ, మరికొందరు మాజీ ప్లేయర్లు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ కోహ్లీ అంగీకరించలేదని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. మాజీ జాతీయ సెలెక్టర్, ఢిల్లీ కోచ్ శరణ్ దీప్ సింగ్ కూడా విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ పర్యటనకు సిద్ధమవుతున్నాడని పేర్కొన్నారు. మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కూడా విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడని నమ్మాడు. కోహ్లీకి బీసీసీఐ, సెలెక్టర్ల మద్దతు లభించలేదని మహ్మద్ కైఫ్ అన్నాడు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కోహ్లీకి తన టెస్ట్ కెరీర్ ఇప్పుడు ముగిసిందని చెప్పి ఉండవచ్చని.. ఆ తర్వాత విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించి ఉండవచ్చని కూడా మాజీ క్రికెటర్ కైఫ్ అన్నాడు.

Story first published: Thursday, May 15, 2025, 14:19 [IST]
Other articles published on May 15, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+