Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అమీర్ ఖాన్ చాట్ షోలో కోహ్లీ: అనుష్క శర్మపై కీలక ప్రశ్న

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ తన ప్రేయసి, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మతో తనకున్న అనుబంధంతో పాటు భారత జట్టులోని మిగతా క్రికెటర్లతో తనకున్న సాన్నిహిత్యాన్ని వెల్లడించాడు. ఓ హిందీ టీవీ ఛానెల్‌ దీపావళిని దృష్టిలో పెట్టుకుని బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమిర్‌ ఖాన్‌, విరాట్‌ కోహ్లీతో చాట్‌ షో నిర్వహించింది.

ఈ చాట్ షో ముంబై ఫిల్మ్ సిటీలోని ఓ స్టూడియోలో చిత్రీకరించారు. ఈ ఇంటర్యూలో విరాట్ కోహ్లీ ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ఈ చాట్ షోని దీపావళి సందర్భంగా ప్రసారం చేయనున్నారు. అంతేకాదు అమీర్ ఖాన్ తాజా చిత్రం 'సీక్రెట్ సూపర్ స్టార్' ప్రమోషన్ కోసం కూడా వినియోగించుకోనున్నాడు.

 కోహ్లీతో అమీర్ ఖాన్ చాట్ షో

కోహ్లీతో అమీర్ ఖాన్ చాట్ షో

చాట్ షోలో భాగంగా అమీర్ ఖాన్.. కెప్టెన్ కోహ్లీని కొన్ని ప్రశ్నలు అడిగాడు. ముఖ్యంగా బాలీవుడ్ నటి అనుష్క శర్మలో మీకు నచ్చేవి.. నచ్చని అంశాలు ఏమిటి అని అడిగాడు. ఇందుకు కోహ్లీ 'తన నిజాయతీ, జాగ్రత్తగా చూసుకునే స్వభావం ఎంతో నచ్చుతాయి. ఇక నచ్చనిది అంటే సమయపాలన. ఎప్పుడూ చెప్పిన టైంకి రాదు. 5-7 నిమిషాల పాటు లేట్‌గా వస్తుంది. కొంచమే కాబట్టి ఎప్పుడూ పెద్దగా ఇబ్బంది అనిపించలేదు' అని కోహ్లీ అన్నాడు.

 ‘చీకూ' అనే ముద్దుపేరు ఎలా వచ్చిందంటే

‘చీకూ' అనే ముద్దుపేరు ఎలా వచ్చిందంటే

ఆ తర్వాత ‘చీకూ' అనే ముద్దుపేరు ఎలా వచ్చిందని ఆమిర్‌ అడిగాడు. ఇందుకు కోహ్లీ 'అండర్‌-17 క్రికెట్‌ ఆడే సమయంలో నా చెవులు చాలా పెద్దగా కనిపించేవి. పొడవాటి జట్టుతో వాటిని కప్పి ఉంచేవాడిని. నా హెయిర్‌ స్టైల్‌ చూసి మిగతా ఆటగాళ్లు ‘చీకూ రాబిట్‌' అంటూ పిలవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ధోని కూడా అలాగే పిలవడం ప్రారంభించాడు. ఒకసారి స్టంప్స్‌ వెనుక ఉన్న ధోని నన్ను చీకూ అని పిలవడం మైక్‌లో రికార్డయ్యింది. అలా ఆ పేరు ప్రచారంలోకి వచ్చింది' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

కోహ్లీపై కేఎల్ రాహుల్ ఇలా

కోహ్లీపై కేఎల్ రాహుల్ ఇలా

ఇదే చాట్ షోకి కోహ్లీతో పాటు జట్టు సహచరుడు కేఎల్ రాహుల్ కూడా వచ్చాడు. ఈ సందర్భంగా కోహ్లీలో తనకు నచ్చని, నచ్చిన విషయాలను రాహుల్ వెల్లడించాడు. ఫిట్‌‌నెస్ విషయంలో కోహ్లీ ఎంతో కఠినంగా ఉంటాడని, జట్టుని ఎంతో బాధ్యాతాయుతంగా నడిపిస్తాడని చెప్పాడు.

 నచ్చిన సినిమాలపై కోహ్లీ

నచ్చిన సినిమాలపై కోహ్లీ

ఇక నచ్చని విషయానికి వస్తే ఛేజింగ్ రూమ్‌లో కోహ్లీ ఎల్లప్పుడూ షర్ట్ లేకుండా ఉంటాడని, ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడని అన్నాడు. చివర్లో తాను నటించిన వాటిలో ఇష్టమైన సినిమాలు ఏమిటని అడగ్గా.. ‘జో జీతా వహి సికిందర్‌', ‘త్రీఇడియట్స్‌', ‘పీకే' అని కోహ్లీ సమాధానమిచ్చాడు.

 ‘పీకే'లో అనుష్క నటించింది కదా

‘పీకే'లో అనుష్క నటించింది కదా

వెంటనే ఆమిర్‌ ఖాన్ నవ్వుతూ అవునవును నీకు ‘పీకే' ఇష్టమని నాకు తెలుసు. ఎందుకంటే అందులో అనుష్క నటించింది కదా అని నవ్వులు పూయించాడు. అనంతరం చివర్లో ఇద్దరూ కానుకలు ఇచ్చి పుచ్చుకున్నారు. ‘దంగల్‌' సినిమా కోసం ఫస్ట్‌ క్లాప్‌ కొట్టిన క్లాపర్‌ను ఆమిర్‌ కోహ్లీకి ఇవ్వగా తాను ధరించిన టీమిండియా జెర్సీని ఆమిర్‌కు కానుకగా ఇచ్చాడు.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+