Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నన్ను నమ్మినవారికి థాంక్స్: ట్విట్టర్‌లో విరాట్ కోహ్లీ

దరాబాద్: ప్రతిష్టాత్మక పాలీ ఉమ్రిగర్‌ అవార్డు అందుకున్న తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన శ్రేయోభిలాషులకు ట్విట్టర్ ద్వారా థాంక్స్ చెప్పాడు. ఈ అవార్డుని అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు ప్రతి ఏటా బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమంలో ఇస్తారు.

కొందరికి నాపై అనుమానం, అసహ్యం: బీసీసీఐ వేడుకలో కోహ్లీ

బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుక బుధవారం (మార్చి 8)న కన్నుల పండుగగా జరిగింది. బెంగుళూరులోని రిట్జ్ హోటల్లో జరిగిన ఈ అవార్డుల కార్యక్రమానికి క్రీడా ప్రముఖలందరూ హాజరయ్యారు. వీరితో పాటు టీమిండియా, అవార్జు విజేతలు ఈ ఫంక్షన్‌కు హాజరయ్యారు.

Virat Kohli Takes to Twitter To Thank Those Who 'Believed' In Him

టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ పాలీ ఉమ్రిగర్‌ అవార్డును, స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్‌ 'దిలీప్‌ సర్దేశాయ్‌' అవార్డును అందుకున్నారు. పాలీ ఉమ్రిగర్‌ అవార్డును మూడుసార్లు అందుకున్న ఏకైక క్రికెటర్‌గా కోహ్లీ గుర్తింపు పొందాడు. 2015-16 సీజన్‌లో అద్భుత ప్రదర్శనకు గాను కోహ్లీని ఈ అవార్డు వరించింది.

ఈ సందర్భంగా క్రికెట్‌లో ఉత్తమ క్రికెటర్‌గా ఎదగడానికి సహకరించిన వారందరికీ కోహ్లీ ధన్యవాదాలు తెలిపాడు. 'మూడోసారి పాలీ ఉమ్రిగర్‌ ట్రోఫీ అవార్డును అందుకోవడం చాలా గర్వంగా ఉంది. నాపై నమ్ముకం ఉంచిన వారందరికీ ధన్యవాదాలు' అని ట్వీట్‌ చేశాడు. 2011-12, 2014-15 సీజన్లలో ఈ అవార్డుని కోహ్లీ అందుకున్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+