Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : ‘నేనైతే అవుట్ ఇచ్చేవాడు’.. అంపైర్‌కు చురకలేసిన విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్!

Virat Kohli takes a dig at umpire Nitin Menon

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి, అంపైర్ నితిన్ మీనన్‌కు సరిగా పడదు. కోహ్లీ విషయానికొస్తే చాలు మీనన్ కొన్ని వింత నిర్ణయాలు ఇస్తుంటాడు. విరాట్ అభిమానులు కూడా ఇదే విషయం చెప్పి మీనన్‌ను ట్రోల్ చేస్తుంటారు. తాజాగా అహ్మదాబాద్ టెస్టులో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. మూడో రోజు ఆటలో విరాట్ కోహ్లీ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడానికి డబుల్ పరిగెత్తాడు. అతను సెలబ్రేట్ చేసుకోబోయేంతలో నితిన్ మీనన్ అడ్డుకున్నాడు. కోహ్లీ బ్యాట్ నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో క్రీజు దాటిందా? లేదా? షార్ట్ రన్ తీశాడా? అని నితిన్ మీనన్ అనుమానం వ్యక్తం చేశాడు.

ఇది చూసిన అభిమానులు మీనన్‌ను తెగ ట్రోల్ చేశారు. కోహ్లీ హాఫ్ సెంచరీ లేట్ చేయాలనే అతను ఇలా చేశాడంటూ మండిపడ్డారు. అయితే కోహ్లీ పరుగు సరిగానే తీయడంతో బతికిపోయాడు. ఇదిలా ఉండగా ఐదో రోజు ఆటలో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తుండగా వికెట్లు తీసేందుకు భారత బౌలర్లు తెగ శ్రమించారు. ఈ క్రమంలోనే అశ్విన్ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్ ఎల్బీ కోసం అప్పీల్ చేశారు. నితిన్ మీనన్ నాటౌట్ ఇచ్చాడు. దీంతో భారత జట్టు రివ్యూ కోరింది. రిప్లేలో అంపైర్స్ కాల్ అని వచ్చింది. దీని వల్ల ట్రావిస్ హెడ్ బతికిపోయాడు.

తమ రివ్యూ కూడా విఫలం అవడంతో అశ్విన్ మళ్లీ బౌలింగ్ చేయడానికి వెళ్లిపోయాడు. నితిన్ మీనన్‌తో అది ఎందుకు నాటౌట్? అన అడుగుతూ వెళ్లాడు. ఈ క్రమంలో మళ్లీ తన ఫీల్డింగ్ పొజిషన్‌కు వెళ్లిపోతున్న కోహ్లీ పెద్దగా.. 'నేనైతే అవుట్ ఇచ్చేవాడు' అని పెద్దగా అన్నాడు. ఈ మాటలు స్టంప్ మైక్‌లో కూడా వినిపించాయి. ఇది విన్న నితిన్ మీనన్ కూడా నవ్వేస్తూ వేలు పైకెత్తి అవుట్ అని చూపించాడు. ఆ తర్వాత థంబ్స్ అప్ చూపించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Story first published: Monday, March 13, 2023, 19:50 [IST]
Other articles published on Mar 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+