
హైదరాబాద్: పూణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ అద్భుతమైన క్యాచ్‌ని అందుకుని మ్యాచ్‌ని మలుపుతిప్పాడు. శనివారం ఓవర్‌నైట్ స్కోర్ 36/3తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో శనివారం 275 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
షమి వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో నైట్ వాచ్‌మెన్ నోర్జె(3) స్లిప్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు. కుడివైపు నుంచి కిందగా వెళ్తున్న బంతిని కోహ్లీ డైవ్‌చేస్తూ అమాంతం బంతిని ఒడిసి పట్టుకున్నాడు. ఆ తర్వాత ఉమేశ్‌యాదవ్ బౌలింగ్‌లో డిబ్రుయిన్(30) కూడా కీపర్ చేతికి చిక్కాడు.
ఔట్ సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతిని వికెట్‌కీపర్ సాహా డైవ్‌చేస్తూ సూపర్ క్యాచ్‌గా అందుకున్నాడు. ఈ రెండు క్యాచ్‌లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతకుముందు భారత్ శుక్రవారం 601/5 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేయగా 326 పరుగుల ఆధిక్యం లభించింది.
ఇంకా రెండు రోజుల ఆటమిగులున్న నేపథ్యంతో కోహ్లీ సఫారీలను ఫాలో ఆన్ ఆడిస్తాడా లేక బ్యాటింగ్ కొనసాగిస్తాడా? అనే విషయం తెలియాల్సి ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటింగ్ చేస్తే పర్యాటక జట్టుకు దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యం నిర్దేశించే అవకాశం ఉంది.