Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీ20ల్లో కోహ్లీ మరో రికార్డు: 45 శాతం పరుగులు చేధనలోనే!

Virat Kohli T20I runs 45 per cent of 2441 have come successfully chasing a total

హైదరాబాద్: విరాట్ కోహ్లీని భారత అభిమానులు ముద్దుగా 'రన్ మెషిన్', 'ఛేజ్ మాస్టర్' అని పిలుచుకునే సంగతి తెలిసిందే. మొహాలీ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి ఈ సిరిస్‌లో శుభారంభం చేసింది. ఫలితంగా మూడు టీ20ల సిరిస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.

72 పరుగులతో నాటౌట్‌గా

72 పరుగులతో నాటౌట్‌గా

ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 52 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 72 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో టీ20ల్లో ఛేజింగ్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. టీ20ల్లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు చేసిన పరుగులు 2441. ఇందులో 45 శాతం పరుగులు కోహ్లీ చేధనలో సాధించాడు.

చేధనలో సత్తా చాటిన కోహ్లీ

చేధనలో సత్తా చాటిన కోహ్లీ

చేధనలో మొత్తం 23 ఇన్నింగ్స్‌ల్లో విరాట్ కోహ్లీ 1115 పరుగులు చేశాడు. ఇందులో 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20ల్లో విరాట్ కోహ్లీ రాణించిన సమయంలో అతడి విన్నింగ్ యావరేజి 111.5గా ఉంది. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ శర్మ 31 ఇన్నింగ్స్‌ల్లో 764 పరుగులు చేశాడు.

టీ20ల్లో 300కుపైగా చేసిన పరుగులు

టీ20ల్లో 300కుపైగా చేసిన పరుగులు

టీ20ల్లో 300కుపైగా చేసిన పరుగులు ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ యావరేజి సైతం ఎక్కువగానే ఉంది. ఈ జాబితాలో కోహ్లీ తర్వాత ఇంగ్లాండ్ క్రికెటర్ అలెక్స్ హేల్స్ 67.22 యావరేజితో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మొత్తంగా చూస్తే కోహ్లీ చేజింగ్‌లో 30 ఇన్నింగ్స్‌ల్లో 1381 పరుగులు చేశాడు.

చేజింగ్‌లో కోహ్లీ 22 సెంచరీలు

చేజింగ్‌లో కోహ్లీ 22 సెంచరీలు

ఇక, వన్డే క్రికెట్ విషయానికి వస్తే ఛేజింగ్‌లో విరాట్ కోహ్లీ(84 ఇన్నింగ్స్‌ల్లో 5214) పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్(5490) ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. చేధనలో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 22 సెంచరీలు చేశాడు. ఈ సెంచరీలు చాలా వరకు టీమిండియా విజయానికి దోహదపడ్డాయి.

Story first published: Friday, September 20, 2019, 19:00 [IST]
Other articles published on Sep 20, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+