For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'భువీ, బుమ్రాలను పక్కన పెట్టి కోహ్లీ ఆశ్యర్యానికి గురి చేశాడు'

Virat Kohli Surprised Me by Not Bowling Bhuvneshwar Kumar or Jasprit Bumrah: Heinrich Klaasen

హైదరాబాద్: నాలుగో వన్డేలో భారత క్రికెట్‌ జట్టులో డెత్‌ ఓవర్ల స్పెషలిస్టులుగా గుర్తింపు తెచ్చుకున్న పేసర్లు భువనేశ్వర్‌ కుమార్‌, బూమ్రాలకు ఎక్కువ ఓవర్లు ఇవ్వకపోవడంపై దక్షిణాఫ్రికా ఆటగాడు క్లాసెన్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. తమ జట్టు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో స్లాగ్‌ ఓవర్లలో బూమ‍్రా, భువీలకు భారత కెప్టెన్‌ కోహ్లి బౌలింగ్‌ ఎందుకు ఇవ్వలేదో తనకు అర్ధం కాలేదన్నాడు. వీరిని పక్కకు పెట్టి స్పిన్నర్లు చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌లు చేత డెత్‌ ఓవర్లు వేయించడంతో ఆశ్చర్యపోయానన్నాడు. శనివారం మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడాడు.

'నన్ను కోహ్లి కచ్చితంగా ఆశ్చర్యానికి గురి చేశాడు. భారత జట్టులో డెత్‌ ఓవర్ల స్పెషలిస్టులుగా బూమ్రా, భువనేశ్వర్‌లు అందుబాటులో ఉన్నారు. మరి అటువంటప్పుడు చివరి ఓవర్లలో వారిని దూరంగా పెట్టి స్పిన్‌ ద్వయం చేత ఎందుకు బౌలింగ్‌ చేయించినట్లు. భారత పేసర్లతో ఆఖర్లో కనీసం రెండేసి ఓవర్లు వేయిస్తారని మిల్లర్‌-నేను అనుకున్నాం. కానీ అందుకు భిన్నంగా స్పిన్నర్ల చేత కోహ్లి బౌలింగ్‌ చేయించి ఆశ్చర్యపరిచాడు' అని క్లాసన్ తెలిపాడు.

'గత మూడు రోజుల నుంచి కుల్దీప్‌ బౌలింగ్‌పై బాగా హోమ్‌వర్క్‌ చేశాం. కుల్దీప్‌(ఎడమచేతి మణికట్టు స్పిన్నర్‌)ను ఆడటానికే ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం. ఈ సిరీస్‌లో ఇప్పటివరకూ స్పిన్నర్లని ఎదుర్కోవడానికి ఇబ్బంది పడ్డాం. కానీ సిరీస్‌ ఆరంభంలో ఉన్న పరిస్థితులు ఇప‍్పుడు లేవు. మేము పూర్తిగా స్పిన్‌ ఎదుర్కొనడానికి కసరత్తులు చేశామని చెప్పను. దాంతో అతన్ని తిప్పికొట్టడానికి ఎక్కువ ప్రాక్టీస్‌ చేశాం' అని క్లాసెన్‌ పేర్కొన్నాడు.

డీకాక్‌ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన కాస్లెన్‌ 27 బంతుల్లో 47 పరుగులు చేసి సఫారీల విజయంలో కీలక పాత్ర పోషించాడు. నాల్గో వన్డేలో కుల్దీప్‌-చాహల్‌లు 11.3 ఓవర్లు బౌలింగ్‌ వేసి 119 పరుగులిచ్చారు. అదే సమయంలో మూడు వికెట్లను మాత్రమే సాధించారు. శనివారం జరిగిన భారత్, దక్షిణాఫ్రికాల మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో భారత్ ఓడిపోయింది. ఐదో వన్డే ఫిబ్రవరి 13 మంగళవారం జరగనుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Sunday, February 11, 2018, 16:54 [IST]
Other articles published on Feb 11, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+