అనుకుంటుండగానే కోహ్లీ 10 వేలు కొట్టేశాడు!!

హైదరాబాద్: క్రికెట్ అంటే కసి.. తనను తానే మలచుకొనే గుణం. ఎన్ని విమర్శలు వచ్చినా నిలదొక్కుకునే స్థైర్యం. అవే కోహ్లీని ఈ స్థాయిలో నిలబెట్టాయి. కెప్టెన్‌గా కొనసాగుతూనే.. బ్యాటింగ్‌లో మాత్రం దూకుడు తగ్గించలేదు. ఓపెనర్లు తడబడినా.. మిడిలార్డర్ పూర్తిగా ఫెయిలైనా.. జట్టుకు తానొక్కడై నిలబడి గెలిపించిన సందర్భాలు కోకొల్లలు.

అప్పటి నుంచి అదే దూకుడుని చూపించి:
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బాదుడు చూసి ఇలాంటి ఆటగాడిని మళ్లీ చూడగలమా.. అనుకునేవాళ్లు. కానీ, కేవలం 205 వన్డేల్లో 10,000 పరుగులు సాధించడమంటే కనీవినీ ఎరగని చరిత్రే. 2008లో అండర్-19 ప్రపంచకప్ అందించి టీమిండియాలోకి అడుగుపెట్టిన కుర్ర కోహ్లీని చూసి బాగా ఆడుతున్నాడని మెచ్చుకున్నారు. ధోనీ తనలో ప్రతిభను ముందే పసిగట్టి కెప్టెన్‌గా సూచించాడు.

ఇంతింతై వటుడింతై
ఆ తర్వాత తనలో ఎన్నో మార్పులు చేసుకొని ‘ఇంతింతై వటుడింతై'అనుకునే రీతిలో సచిన్ రికార్డులను ఒక్కొక్కటిగా బద్దలు కొడుతూ విమర్శకులు ముక్కున వేలేసుకునేలా చేశాడు. సీనియర్ జట్టు కెరీర్ ఆరంభంలో.. తొలి పది మ్యాచుల్లో తన అసలైన ప్రతిభ చూపని కోహ్లీ ఆ తర్వాత చిచ్చర పిడుగులా చెలరేగాడు. మైదానంలో సునామీ సృష్టించాడు.

ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకుంటూనే:
స్వదేశమా.. విదేశమా అని చూసేది లేదు. బౌలర్లపై విరుచుకుపడడమే కోహ్లీ చేసిన పని. ఒకసారి జరిగిన పొరబాటును పునరావృతం కాకుండా జాగ్రత్తపడుతూనే దూకుడు చూపించాడు. విమర్శలనే ఇటుకలను ఒక్కో మెట్టుగా పేర్చాడు. తనను తాను ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకున్నాడు. జట్టులో ఉంటూనే సచిన్‌తో పోల్చేలా ఆడాడు. ఇప్పుడు సచిన్ పదివేల పరుగుల రికార్డునూ తుడిచిపెట్టేశాడు.

మరో చరిత్ర సృష్టించాడు
విండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో 81 పరుగులు చేసి అత్యంత వేగంగా అంతర్జాతీయ వన్డేల్లో పదివేల పరుగుల శిఖరాన్ని అధిరోహించిన క్రికెట్ యోధుడిగా మరో చరిత్ర సృష్టించాడు. తన ఆరాధ్యదైవం సచిన్ 259 వన్డేల్లో ఈ ఘనత సాధించగా కోహ్లీ కేవలం 205 మాత్రమే తీసుకోవడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications