4 డబుల్ సెంచరీలు: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ
హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో కోహ్లీ వరుసగా నాలుగో డబుల్ సెంచరీని సాధించాడు. తద్వారా టెస్టు క్రికెట్ చరిత్రలో వరుసగా నాలుగు సిరీస్‌లలో నాలుగు డబుల్ సెంచరీలు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు 111 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ప్రారంభించిన కోహ్లీ డబుల్ సెంచరీని సాధించాడు. అంతక ముందు కోహ్లీ ఆడిన వెస్టిండిస్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ సిరిస్‌లలో వరుసగా మూడు డబుల్ సెంచరీలు చేసిన కోహ్లీకి ఇది నాలుగో డబుల్ సెంచరీ కావడం విశేషం.

డాన్ బ్రాడ్‌మన్, రాహుల్ ద్రవిడ్ రికార్డుని అధిగమించిన కోహ్లీ
ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజాలు డాన్ బ్రాడ్‌మన్, రాహుల్ ద్రవిడ్ లాంటి దిగ్గజాలను కోహ్లీ అధిగమించాడు. డాన్ బ్రాడ్‌మన్, రాహుల్ ద్రవిడ్‌లు మాత్రమే వరుసగా మూడు సిరిస్‌లలో మూడు డబుల్ సెంచరీలను సాధించారు. 2011లో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ బంగ్లాదేశ్‌తో హైదరాబాద్‌లో ప్రస్తుతం ఆడుతున్న టెస్టు 54వ టెస్టు.

16 సెంచరీలు, 14 అర్ధసెంచరీలు చేసిన కోహ్లీ
టెస్టుల్లో కోహ్లీ ఇప్పటివరకు 16 సెంచరీలు, 14 అర్ధసెంచరీలు నమోదు చేశాడు. కాగా, బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి 204 పరుగులు చేసి తైజుల్ ఇస్లామ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు చేరాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఈ టెస్టులో కోహ్లీ మరో రికార్డు సృష్టించాడు.

వీరేంద్ర సెహ్వాగ్ రికార్డుని అధిగమించిన కోహ్లీ
ఒక సీజన్లో భారత గడ్డపై అత్యధిక స్కోరు చేసిన టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రికార్డుని అధిగమించాడు. బంగ్లా టెస్టులో 144 పరుగులు చేయడంతో కోహ్లీ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ సీజన్‌లో 9 టెస్టులాడిన విరాట్.. 1116 పరుగులు చేశాడు. దీంతో 2004-05 సీజన్‌లో 9 టెస్టుల్లో 1105 పరుగులతో సెహ్వాగ్ పేరిట ఉన్న రికార్డుని అధిగమించాడు.

బంగ్లా బౌలర్ షకీబ్ ఉల్ హాసన్ వేసిన బంతితో
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ రెండో రోజైన శుక్రవారం ప్రారంభమైంది. ఈ క్రమంలో బంగ్లా బౌలర్ షకీబ్ ఉల్ హాసన్ వేసిన బంతిని బౌండరీకి తరలించడంతో కోహ్లీ... సెహ్వాగ్ పేరిట ఉన్న రికార్డుని అధిగమించాడు. 2004-05 సీజన్లో వీరేంద్ర సెహ్వాగ్ 17 మ్యాచ్ లాడి 4 సెంచరీలు, మూడు అర్ధసెంచరీలతో 1105 పరుగులు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications