
హైదరాబాద్: జోహన్నస్‌బర్గ్ స్టేడియంలో మూడో టెస్టు విజయం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మరో కొత్త రికార్డును తెచ్చిపెట్టింది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఆల్ టైం ర్యాంకింగ్స్‌లో బ్రియాన్ లారాను దాటేశాడు. తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అతడు రెండో స్థానాన్ని నిలుపుకున్నాడు.
ర్యాంకింగ్స్ పాయింట్లను 900 నుంచి 912కు పెంచుకున్న కోహ్లి.. అత్యుత్తమ కెరీర్ ర్యాంకింగ్ పాయింట్లలో బ్రయాన్ లారా (911)ను దాటేశాడు. సునీల్ గావస్కర్ (916)కు చేరువయ్యాడు. తాజా ర్యాంకింగ్స్‌లో స్టీవ్ స్మిత్ (947) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. జూన్‌లో జరగాల్సి ఉన్న అఫ్గనిస్తాన్‌తో జరిగే టెస్టు, ఇంగ్లాండ్‌తో ఆగష్టు లేదా సెప్టెంబరులో మొదలుకానున్న ఐదు టెస్టుల సిరీస్‌లో కోహ్లీ ఇంకా పాయింట్లను సాధిస్తే వీళ్లను దాటేసేందుకు అవకాశముంటుంది.
కోహ్లీతో పాటుగా ఇతర బ్యాట్స్‌మెన్‌లు సైతం వారి ప్రతిభను మెరుగుపరుచుకున్నారు. ఆమ్లా ఒక స్థానం దాటి ఏడో స్థానంలో ఉండగా, అజింకా రహానె ఐదు స్థానాలు దాటి 18వ స్థానంలో ఉన్నాడు.
మూడో టెస్టు విజయం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇది మాకు ఓ స్వీటెస్ట్ విన్ అంటూ అభిప్రాయపడ్డాడు నాయకుడు విరాట్. 'దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ టెస్టులో భారత బౌలర్లు ఏ పరిస్థితుల్లో అయినా జట్టును గెలవగలమనే నమ్మకాన్ని సృష్టించారు. మేము గెలుస్తామనే నమ్మకంగానే ఉన్నాం. కానీ, అదే ఆడి చూపించాం. మీరు టెస్టు మ్యాచ్‌లలో ఓడిపోయారు కదా అని అడిగిన ప్రశ్నకు సమాదానంగా కోహ్లీ ఇలా అన్నాడు. అవును మేము ముందు ఓడిపోయాం. కానీ, విజయంతో ముగింపునిచ్చాం.' అంటూ కోహ్లీ బదులిచ్చాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.