కౌంటీలకు దూరంగా కోహ్లీ, వైద్యుల సంచలన నిర్ణయం

హైదరాబాద్: అంతా అనుకున్నట్లే అయింది. కౌంటీల్లో ఆడేందుకు తానొక్కడే బలంగా సంకల్పించుకున్నా.. కోహ్లీ కౌంటీల్లో ఆడటం పట్ల చాలామంది విముఖత చూపించారు. ఇప్పుడు వారి నమ్మకానికి కోహ్లీకి వచ్చిన ఆరోగ్య సమస్య తోడైంది. మరి కొద్ది రోజుల్లో కౌంటీ క్రికెట్ ప్రారంభంకాబోతుంది. సర్రే తరఫున కౌంటీల్లో ఆడటం ద్వారా ఇంగ్లాండ్ పర్యటనకు సన్నద్ధం కావాలని కోహ్లి భావించాడు.

సర్రేతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నా..
ఈ క్రమంలో ఇప్పటికే సర్రేతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. కానీ వెన్నెముక సంబంధిత సమస్య (హెర్నియేటెడ్ డిస్క్) కారణంగా కౌంటీ క్రికెట్‌కు దూరం కానున్నాడని తెలుస్తోంది. కౌంటీలకు దూరంగా ఉండాలని దేశంలోని టాప్ ఆర్థోపెడిక్ సర్జన్ ఒకరు విరాట్ కోహ్లికి సూచించారు.

ఇంగ్లాండ్ పర్యటనకు ఆరోగ్యం సహకరించిదని
కౌంటీల్లో ఆడితే జూలైలో ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ పర్యటనకు ఆరోగ్యం సహకరించిదని ఆ సర్జన్ కోహ్లిని హెచ్చరించారు. ఐపీఎల్ అనంతరం కౌంటీలకు సిద్ధమయ్యే పనిలో పడిన విరాట్.. బుధవారం ముంబైలోని ఖార్ హాస్పిటల్‌కు వెళ్లి ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలిసినట్లు తెలుస్తోంది. ఈ పరీక్షలో వెన్నెముకకు సంబంధించిన నరాలు పాక్షికంగా దెబ్బతిన్నట్లు వైద్యుల బృందం తెలిపింది.

కోహ్లికి సర్జరీ అవసరం లేదని డాక్టర్లు స్పష్టం
ప్రస్తుతానికి కోహ్లికి సర్జరీ అవసరం లేదని డాక్టర్లు స్పష్టం చేశారు. కౌంటీల్లో ఆడటం కోసం కోహ్లి అప్ఘాన్‌తో జరగనున్న చార్రితక టెస్ట్ మ్యాచ్‌కు దూరంగా ఉంటున్నాడు. కానీ గాయం కారణంగా కౌంటీ క్రికెట్‌కు కూడా దూరం అవుతున్నాడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. కౌంటీల్లో తాను ఆడబోవడం లేదని కోహ్లి ఇప్పటికే సర్రే జట్టుకు సమాచారం పంపాడట.

ఇంగ్లాండ్‌లో తొలిసారి పర్యటించిన కోహ్లి
2014లో ఇంగ్లాండ్‌లో తొలిసారి పర్యటించిన కోహ్లి ఐదు టెస్టులు ఆడి కేవలం 134 పరుగులు మాత్రమే చేశాడు. స్వింగ్ బంతిని ఎదుర్కోవడంలో విఫలమైన విరాట్ ఆ సిరీస్‌లో నాలుగుసార్లు అండర్సన్‌కి వికెట్ సమర్పించుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications